భూగోళం మీద 85% మంది చూడగల అరుదైన చంద్రగ్రహణం
Lunar eclipse 2025: ఈ నెల 7- 8 తేదీల్లో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది- పౌర్ణమి రోజున రాహుగ్రస్త కాలంలో శతభిష నక్షత్రంలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఆ రోజు నుంచే పితృపక్షం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.
7వ తేదీ రాత్రి 9:58 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘ గ్రహణ కాలం ఇది. 11 గంటల సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 11:42 నిమిషాలకు చంద్రుడు పరిపూర్ణంగా గ్రహణ ఛాయలోకి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి దాటిన తరువాత 12:22 నిమిషాలకు గ్రహణం విడుస్తుంది. వేకువ జామున 1:26 నిమిషాలకు గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.

ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్ కత, భువనేశ్వర్, గౌహతి, భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ వంటి నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి నేరుగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో చంద్రుని ఉపరితలంపై భూమి ఛాయ పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు-నారింజ రంగులో కనువిందు చేస్తాడు.
భారత్ సహా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో పశ్చిమ, దక్షిణ అమెరికాలో తూర్పు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా పరిధుల్లోని అన్ని దేశాలు ఈ చంద్రగ్రహణాన్ని చూడగలవు.
ఒకరకంగా చెప్పాలంటే- ప్రపంచ జనాభాలో సుమారు 85% మంది కనీసం కొంత భాగాన్ని చూడగలిగే అరుదైన చంద్రగ్రహణం ఇది. సంపూర్ణంగా కాకపోయినా పాక్షికంగానైనా ఆయా దేశాలు, ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమేఇది కనిపించదంతే.
చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎటువంటి రక్షణ పరికరాలు అవసరం లేదు. నేరుగా చూడొచ్చు. చందమామపై ఉన్న బిలాలు, ఉపరితలం, అక్కడి పరిస్థితులు, ఎరుపు- నారింజ రంగులను మరింత లోతుగా తిలకించాలంటే మాత్రం బైనాక్యులర్స్ లేదా స్పేస్ టెలిస్కోప్ లను ఉపయోగించవచ్చు. దీన్ని చిత్రీకరించడానికి, డీఎస్ఎల్ఆర్ లేదా స్మార్ట్‌ఫోన్ కు ట్రైపాడ్‌పై అమర్చాలి. 1-2 సెకన్ల లాంగ్ ఎక్స్‌పోజర్లు ఉంటే మంచి వీడియో తీయవచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications