జూన్ లో google pay సేవలు బంద్.. విషయం ఏమిటంటే!!

నగదును నేరుగా తీసుకువెళ్లే రోజులు పోయి... ప్రతి చిన్న అవసరానికి డిజిటల్ లావాదేవీలు చేయడం అలవాటయింది. ఇప్పుడు చాలామందికి డబ్బును క్యారీ చేయాలంటే కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇక డిజిటల్ లావాదేవీలు పెరిగిన తరుణంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు మన నగదు అవసరాలను తీరుస్తూ నిత్యం లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది.

మన నిత్యావసరాలు మొదలుకొని, కరెంట్ బిల్లులు కట్టడం, ఇన్సూరెన్స్ లు కట్టడం, షాపింగ్ చేయడం, మొబైల్ రీఛార్జ్ వంటివి చేయడం కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని మన ఉపయోగించుకుంటున్నాం. ఇక ఈ క్రమంలో తాజాగా గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నట్టు గూగుల్ ప్రకటన చేసింది.

Google Pay services will stop from june4th in USA.. here is the full details

అయితే ఇది వినడానికి కాస్త షాకింగ్ గా అనిపించినా ... ఈ ప్రకటన మనకు మాత్రం కాదు అన్నది ముఖ్యంగా భారతీయులు తెలుసుకోవలసిన అంశం. జూన్ నెల నుండి యూఎస్ లో గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి. అక్కడ జూన్ 4వ తేదీ నుండి గూగుల్ పే షట్ డౌన్ చేయబడుతుందని గూగుల్ వెల్లడించింది.

ఇక ఈ షట్ డౌన్ వెనుక కారణాలను కూడా చెప్పిన గూగుల్ యూఎస్ లో గూగుల్ వాలెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ పే ను ఎక్కువ మంది వినియోగించడం లేదని చాలామంది గూగుల్ వాలెట్ కే మొగ్గు చూపుతున్నారని అందుకే గూగుల్ పే ను షట్ డౌన్ చేయబోతున్నామని google వెల్లడించింది.

ఇకపై గూగుల్ పే వినియోగదారులు గూగుల్ వాలెట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుకోవాలని గూగుల్ వెల్లడించింది. అయితే ఇది భారతదేశంలో వర్తించదని భారతదేశంలో గూగుల్ పే అలాగే కొనసాగుతుందని భారతదేశంలోని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ ప్రకటించింది. ఇక తమ సంస్థ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటామని గూగుల్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+