గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో ఫోన్స్ ఇవే.. ఫీచర్స్ లీక్ !
గూగుల్ తన కొత్త పిక్సెల్ 10 సిరీస్‌ను 2025 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సిరీస్ ఇంకా విడుదల కాకముందే ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.
ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అనే నాలుగు ఫోన్‌లు ఉండనున్నాయి. ఈ ఫోన్లు ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా గత మోడల్స్ కి అప్‌గ్రేడ్స్‌తో రానున్నాయి. లేటెస్ట్ గా ఈ ఫోన్ లకు సంబంధించి ధర, కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్‌లు వంటి వివరాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ ఫోన్ ల కోసం మార్కెట్ లో ఫుల్ డిమాండ్ నెలకొంది.

Google Pixel 10 సిరీస్ ఫీచర్స్..
ధరలు..
Pixel 10 - రూ.79,999
Pixel 10 Pro - రూ.90,600
Pixel 10 Pro XL - రూ.1,17,700
Pixel 10 Pro Fold - రూ.1,79,999
ప్రతి వేరియంట్‌కు ఇవి కేవలం అంచనా విలువ మాత్రమే అని తెలుస్తోంది. ఈ ఫోన్లు విడుదలైన వారం తర్వాత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Pixel 10 స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే..
6.3 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్..
గూగుల్ టెన్సర్ G5
ఆపరేటింగ్ సిస్టమ్..
Android 16
RAM & స్టోరేజ్..
12GB LPDDR5X RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
ఫ్రంట్ కెమెరా..
42MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ..
4970mAh బ్యాటరీ, 29W ఫాస్ట్ ఛార్జింగ్
Pixel 10 Pro & Pro XL - హై ఎండ్ ఫీచర్లతో..
Pixel 10 Pro, Pro XL వేరియంట్‌లు కెమెరా, ఇతర ఫీచర్ల పరంగా ఒకే విధంగా ఉండే అవకాశముంది. కానీ డిస్‌ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే మార్పులు ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కెమెరా సెటప్ (రియర్):
50MP ప్రైమరీ కెమెరా
48MP టెలిఫోటో లెన్స్
48MP అల్ట్రా-వైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా:
42MP
RAM & స్టోరేజ్..
12GB RAM, బహుశా 128GB/256GB వేరియంట్లు
బ్యాటరీ..
Pixel 10 Pro: 4870mAh
Pixel 10 Pro XL: 5200mAh
చార్జింగ్..
29W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్
Pixel 10 Pro Fold..
ఈ మోడల్ ప్రత్యేకత ఫోల్డబుల్ డిజైన్. డ్యూయల్ డిస్‌ప్లే, అధునాతన కెమెరా సెటప్‌తో ఇది అత్యాధునిక వేరియంట్‌గా నిలవనుంది.
డిస్‌ప్లే..
6.4 అంగుళాల మినీ డిస్‌ప్లే (120Hz OLED ప్యానెల్)
రియర్ కెమెరా సెటప్..
48MP ప్రైమరీ కెమెరా
10.8MP టెలిఫోటో
10.5MP అల్ట్రా వైడ్ యాంగిల్
ఫ్రంట్ కెమెరాలు..
రెండు 10MP సెల్ఫీ కెమెరాలు (ఇనర్ & కవర్ డిస్‌ప్లే కోసం)
బ్యాటరీ..
5000mAh - పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కంటే మెరుగైనది
ప్రాసెసర్ & OS..
టెన్సర్ G5, Android 16
ఇతర ముఖ్య విశేషాలు..
డిజైన్ : పిక్సెల్ 10 సిరీస్ పాత మోడళ్లను పోలి ఉండేలా ఉన్నా, మూడవ వెనుక సెన్సార్, స్లిమ్ ఫ్రేమ్‌తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంటుంది.
సెక్యూరిటీ : ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు
సాఫ్ట్‌వేర్ సపోర్ట్ : కనీసం 5 ఏళ్ల వరకు Android & సెక్యూరిటీ అప్‌డేట్స్
AI ఫీచర్లు : Google Gemini ఆధారిత ఇంటెలిజెంట్ ఫోటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్క్రిప్ట్, మెరుగైన వాయిస్ టైపింగ్ వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications