సామాన్యులకు జీఎస్టీ ఊరట: ఏ వాహనాల ధరలు తగ్గాయో, ఏవి పెరిగాయో తెలుసా?

GST Reform: దేశంలో అందరికీ నచ్చే పండుగలలో దీపావళి ముందుంటుంది. ఆ దీపావళి పండుగకు ముందు భారతీయ వాహన కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై పన్ను రేట్లలో భారీ మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. కొన్ని రకాల కార్లు, బైకులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఈ మార్పుల వల్ల వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి.

ఏ వాహనాలు చౌకగా లభిస్తాయి?
కార్లు: 1200 సీసీ వరకు పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్‌జీ కార్లు, అలాగే 1500సీసీ వరకు ఉన్న డీజిల్ కార్లు(4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్నవి) ఇప్పుడు కేవలం 18 శాతం జీఎస్టీతో లభిస్తాయి. దీనివల్ల దాదాపు 8 శాతం నుంచి 10 శాతం వరకు ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు మారుతి ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ డిజైర్, క్రెటా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో, పంచ్ వంటి కార్లపై ఇది వర్తిస్తుంది. దాదాపు రూ.7 లక్షల విలువ ఉన్న కార్లపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

GST Reform Small Cars and Bikes Get Cheaper Luxury Vehicles to Cost More

సెడాన్‌లు: మధ్యస్థ సెడాన్‌లైన హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి కార్లపై కూడా 3 శాతం నుండి 5 శాతం వరకు పన్ను తగ్గుతుంది. దీని వల్ల రూ.15 లక్షల విలువైన కార్లపై రూ.45,000 నుంచి రూ.75,000 వరకు లాభం పొందవచ్చు.

బైక్‌లు: 350సీసీ వరకు ఉన్న బైక్‌లపై కూడా జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. హోండా షైన్, స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ అపాచే, బజాజ్ పల్సర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లాంటి బైక్‌లు 10 శాతం వరకు చౌకగా లభిస్తాయి. ఉదాహరణకు రూ.1 లక్ష బైక్‌పై రూ.10,000 వరకు, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై దాదాపు రూ.20,000 వరకు ఆదా చేయవచ్చు.

ఏ వాహనాలు ఖరీదైనవిగా మారతాయి?
కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం.. లగ్జరీ కార్లు, పెద్ద ఇంజిన్ల బైక్‌లపై పన్ను రేటు 40 శాతానికి పెరిగింది. దీనివల్ల వాటి ధరలు భారీగా పెరుగుతాయి.

లగ్జరీ కార్లు: టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 (హై-ఎండ్ మోడల్స్), ఎంజీ గ్లోస్టర్, జీప్ కంపాస్ వంటి ఎస్‌యూవీల ధరలు 10 శాతం నుండి 12 శాతం వరకు పెరుగుతాయి.

ప్రీమియం బైక్‌లు: 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ, కేటీఎం 390, హార్లే డేవిడ్‌సన్, ట్రయంఫ్ వంటి బైక్‌ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు రూ.3.6 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ధర ఇప్పుడు రూ.4 లక్షలు దాటవచ్చు.

ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
ఈ కొత్త జీఎస్టీ విధానం మధ్యతరగతి, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. సామాన్యులు వాడే చిన్న కార్లు, 350సీసీ వరకు ఉన్న బైక్‌లను చౌకగా అందించడం ద్వారా ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలనుకుంటోంది. అదే సమయంలో, లగ్జరీ, ఖరీదైన వాహనాలపై అధిక పన్ను విధించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+