కేవలం రూ. 3,999 మాత్రమే.. HMD హైబ్రిడ్ ఫోన్ "టచ్ 4G" లాంఛ్..!!

నోకియా ఫీచర్‌ ఫోన్‌లను తయారు చేసే HMD గ్లోబల్ ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. తమ మొదటి హైబ్రిడ్ ఫోన్ "HMD టచ్ 4G"ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.3,999 కానీ అందించే ఫీచర్లు మాత్రం స్మార్ట్‌ఫోన్ స్థాయిలో ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. "ఫీచర్ ఫోన్ ధరలో స్మార్ట్‌ఫోన్" అంటూ కంపెనీ ప్రకటించింది.

కాంపాక్ట్ డిజైన్‌లో ఫీచర్ ఫోన్..

HMD టచ్ 4Gలో 3.2 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే (320x240 పిక్సెల్స్ రిజల్యూషన్) ఉంది. టచ్ ఆధారిత సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఇది పెద్దలకు, చిన్న పిల్లలకు కూడా సులభంగా ఉపయోగించగల ఫోన్‌గా రూపొందించారు. ప్యానెల్ రకాన్ని కంపెనీ వెల్లడించకపోయినా, కాంతి ప్రతిబింబాన్ని తగ్గించే క్వాలిటీ గ్లాస్ వాడినట్లు తెలుస్తోంది.

hmd-hydrid-touch-4g-price-and-specifications-details

HMD టచ్ 4G ఫీచర్లు..

ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్..

  • ఈ ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన "ఎక్స్‌ప్రెస్ చాట్" యాప్ ద్వారా Android, iOS వినియోగదారులతో కూడా చాట్ చేయవచ్చు.

13 భాషల్లో వీడియో కాల్స్..

  • వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్‌లు, గ్రూప్ చాట్‌లు
  • 13 భారతీయ భాషల్లో ఇంటర్‌ఫేస్
  • ఇంటర్నెట్ డేటా ఆధారంగా సెక్యూర్ కమ్యూనికేషన్
  • దీంతో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించని పెద్దవాళ్లకూ తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్‌లో కనెక్ట్ కావడం సులభమవుతుంది.

కెమెరా..

  • ఫోన్ వెనుక 2MP కెమెరా, ముందువైపు VGA కెమెరా (0.3MP) ఉన్నాయి.
  • వెనుక భాగంలో LED ఫ్లాష్ కూడా ఉంది.
  • అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ICE (In Case of Emergency) బటన్‌ను ప్రత్యేకంగా అందించారు - ఒక క్లిక్‌తో అత్యవసర కాల్ లేదా ఎక్స్‌ప్రెస్ చాట్ కనెక్షన్ ఏర్పడుతుంది.

ప్రాసెసర్..

  • HMD టచ్ 4Gలో Unisoc T127 ప్రాసెసర్ ఉంది. ఇది తక్కువ పవర్ వినియోగించే ఎంట్రీ లెవల్ చిప్‌సెట్.
  • ఈ పరికరం Android OS కాకుండా RTOS (Real-Time Operating System) పై పనిచేస్తుంది.
  • దీని వల్ల ఫోన్ వేగంగా స్పందిస్తుంది, బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది, మరియు సెక్యూరిటీ మెరుగ్గా ఉంటుంది.

క్లౌడ్ యాప్‌ & క్రికెట్ లైవ్ అప్డేట్స్..

  • HMD భారతీయ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని క్లౌడ్ ఫోన్ సర్వీస్ను అందిస్తోంది. దీనివల్ల యూజర్లు క్రింది ఫీచర్లను పొందవచ్చు:
  • లైవ్ క్రికెట్ స్కోర్లు
  • వాతావరణ అప్‌డేట్‌లు
  • వార్తలు, ట్రెండింగ్ వీడియోలు
  • HTML5 గేమ్స్
  • ఇవి అంతా క్లౌడ్ బ్రౌజర్ షార్ట్‌కట్‌ల రూపంలో అందుబాటులో ఉంటాయి, ఫోన్‌లో స్టోరేజ్ తక్కువగా ఉన్నా ఇబ్బంది ఉండదు.

కనెక్టివిటీ & బ్యాటరీ..

  • HMD టచ్ 4Gలో Wi-Fi, Wi-Fi హాట్‌స్పాట్ షేరింగ్, బ్లూటూత్, Type-C ఛార్జింగ్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
  • 1,950 mAh (2000 mAh రేటెడ్) తొలగించగల బ్యాటరీతో ఇది వస్తుంది. కంపెనీ ప్రకారం ఒకసారి ఛార్జ్ చేస్తే 30 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది.
  • దీని IP52 రేటింగ్ ఫోన్‌ను ధూళి, నీటి చుక్కల నుండి రక్షిస్తుంది.

స్టోరేజ్..

ఈ హైబ్రిడ్ ఫోన్‌లో 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అయితే మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా 32GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అంటే, మ్యూజిక్, ఫోటోలు లేదా వీడియోలను నిల్వ చేయడానికి తగినంత స్థలం లభిస్తుంది.

ధర..

HMD టచ్ 4G ఫోన్ ధర రూ.3,999.

ఇది అక్టోబర్ 7, 2025 నుండి ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో, అలాగే HMD.com అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+