Instagram పదే పదే అదే రీల్స్? సింపుల్‌గా ఇలా ఫిక్స్ చేయండి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్... ఒకప్పుడు టైమ్‌పాస్‌, ఇప్పుడు డైలీ రొటీన్‌. చదువు నుంచి ట్రెండ్స్‌, ఫిట్‌నెస్ నుంచి ఫన్‌ వరకు - జనరేషన్ Z ఎక్కువగా నమ్మే డిజిటల్ స్టేజ్ ఇదే. అందుకే మెటా కూడా రీల్స్‌కే పెద్ద పీట వేసింది. గతేడాది భారతదేశంలో 'రీల్స్-ఫస్ట్' లేఅవుట్‌ను పరీక్షించడం వెనుక ఉద్దేశ్యం ఒక్కటే - యూత్ అటెన్షన్‌ను పూర్తిగా క్యాప్చర్ చేయడం.

కానీ ఒక దశ తర్వాత చాలామందికి ఇదే ఫీలింగ్ వస్తోంది - "అయ్యో... ఇవే వీడియోలు మళ్లీ మళ్లీ!", "నాకు ఇవి ఎందుకు చూపిస్తోంది?" అని. కారణం సింపుల్‌. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మీరు చేసే ప్రతి చిన్న క్లిక్‌ను గమనిస్తుంది. ఒక రీల్‌ను ఫుల్‌గా చూడటం, రీప్లే చేయటం, లైక్ కొట్టటం లేదా కామెంట్ పెట్టటం - ఇవన్నీ మీ ఇంట్రెస్ట్స్‌గా యాప్ నోటు చేసుకుంటుంది. ఒక్కసారి ఏదైనా కంటెంట్‌పై ఆసక్తి చూపితే, దానికి సంబంధించిన వీడియోల వర్షమే మొదలవుతుంది.

Instagram Reels Algorithm Reset Explained How Gen Z Can Refresh Feed Fix Repeated Content and Control Suggestions Easily

రీల్స్ అల్గారిథమ్ రీసెట్..

అయితే మన ఆసక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్న ట్రెండ్‌గా అనిపించినది, ఈరోజు బోర్‌గా అనిపించవచ్చు. కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించే కంటెంట్ కూడా ఫీడ్‌లోకి వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఫీడ్‌ను పూర్తిగా ఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే పాయింట్‌ను గుర్తించిన ఇన్‌స్టాగ్రామ్, యూజర్లకు 'రీల్స్ అల్గారిథమ్ రీసెట్' చేసే అవకాశం ఇచ్చింది.

ఈ రీసెట్ అంటే అకౌంట్ డిలీట్ చేయడం కాదు, రీల్స్ చూడటం ఆపేయడం కాదు. మీకు నచ్చని సూచనల్ని పక్కన పెట్టి, కొత్తగా మొదలుపెట్టే అవకాశం మాత్రమే. దీనివల్ల మీ రీల్స్ ఫీడ్ కొత్త టాపిక్స్, కొత్త వైబ్స్‌తో మళ్లీ రీబూట్ అవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అల్గారిథమ్‌ను రీసెట్ చేయడం చాలా ఈజీ.

  • యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్‌కి వెళ్లాలి.
  • అక్కడ కుడి వైపున మూడు గీతల ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.
  • తర్వాత 'Content Preferences' అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
  • అందులో 'Reset Suggested Content' అనే ఎంపిక కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి, స్క్రీన్‌పై చూపించే వివరాలను ఒకసారి చదివాలి.
  • రీసెట్‌ను కన్ఫర్మ్ చేస్తే చాలు.

రీసెట్ చేసిన వెంటనే మ్యాజిక్ జరగదు. ఇన్‌స్టాగ్రామ్ మెల్లగా మీ కొత్త వీక్షణ అలవాట్లను గమనించి, మళ్లీ ఫీడ్‌ను కస్టమైజ్ చేస్తుంది. కొద్ది రోజులు మీకు పూర్తిగా కొత్త కంటెంట్ కనిపించవచ్చు. ముఖ్యంగా - ఒకసారి రీసెట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేమని ఇన్‌స్టాగ్రామ్ క్లియర్‌గా చెబుతోంది.

మొత్తానికి, ఒకే రకమైన రీల్స్‌తో విసిగిపోయిన Gen Zకి ఇది చిన్న డిజిటల్ రీస్టార్ట్ లాంటిది. ఫీడ్ బోర్‌గా మారిందనిపిస్తే, స్వైప్ చేయడం కాదు... రీసెట్ చేయడం బెస్ట్ ఆప్షన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+