ఇస్రోకు బిగ్ ఝలక్- ప్రయోగం విఫలం?

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రోకు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది చేపట్టిన మొట్టమొదటి మిషన్ విఫలమైంది. చివరి నిమిషంలో ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సీ62 ప్రయోగాన్ని విఫలమైంది. ఈ రాకెట్.. దిశను మార్చుకుంది. కక్ష్యలోకి ప్రవేశించాల్సిన దశలో తన దిశను మార్చుకుంది. ఇది రాకెట్ మూడో దశ. చివరిదైన నాలుగో స్టేజ్ మిగిలివుండగానే.. అది కక్ష్యను దాటుకుని పరిభ్రమించింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. దీనికి గల కారణాలను అన్వేసిస్తోన్నామని తెలిపింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ62 మిషన్ ప్రయోగంలో పీఎస్3 దశ చివరిలో సాంకేతిక లోపం ఎదురైందని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ ప్రకటించారు. ఈ ఘటనపై నిపుణులు సమగ్ర విశ్లేషణను ప్రారంభించారని తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సీ62 / ఈఓఎస్-ఎన్‌1 మిషన్‌ను ప్రయోగించామని, మూడవ దశ చేరేంత వరకు వాహనం పనితీరు ఆశించిన విధంగానే ఉందని, ముగింపునకు దగ్గరగా ఉన్నప్పుడు అసాధారణ పరిస్థితి తలెత్తిందని వివరించారు. దిశను మార్చుకుందని, ప్రస్తుతం దీనికి గల డేటాను విశ్లేషిస్తోన్నామని చెప్పారు.

ISRO PSLV-C62 Faces PS3 End-Stage Anomaly Detailed Review Commenced

పీఎస్ఎల్వీ- డీఎల్ వేరియంట్‌లో అయిదో మిషన్‌గా రూపొందించిన ఈ స్పేస్ వెహికల్ ఎత్తు 44.4 మీటర్లు. లిఫ్ట్ ఆఫ్ బరువు 260 టన్నులు. ఈ రాకెట్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశ 2పీఎస్ఓఎం ఎక్స్ ఎల్+ ఎస్ 139. రెండవది పీఎల్ 40 (హెచ్ పీ). మూడోదశలో హెచ్ పీఎస్ 3 కాగా.. కీలకమైన నాలుగో ఫేస్ లో ఎల్ 2.5 (ఏఐ) కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. మూడోదశ చిట్టచివరిలో ఇది విఫలమైందని ఇస్రో చీఫ్ తెలిపారు.

ఈ మిషన్ ప్రధాన పేలోడ్ ఈఓఎస్- ఎన్1. పర్యావరణ పర్యవేక్షణకు ఉద్దేశించిన అత్యాధునిక హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. ఈ ఏడాది ఇస్రో చేప్టిన తొలి మిషన్ విఫలం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం సరిగ్గా 10:18 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ వర్క్‌హార్స్ గా పేరుగాంచిన పీఎస్ఎల్ వీ సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం.

పీఎస్ఎల్వీ-సీ62 కోర్-అలోన్ కాన్ఫిగరేషన్‌లో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి (low Earth orbit) విజయవంతంగా ప్రవేశపెట్టేలా దీన్నిఆప్టిమైజ్ చేశారు. భూ ఉపరితలం నుంచి సుమారు 650 కిలో మీటర్ల ఎత్తులో సన్ సింక్రనైజ్డ్ ఆర్బిట్ లో ఇది పని చేస్తుంది. సన్ సంక్రనైజ్డ్ ఆర్బిట్ లో ప్రవేశించే సమయంలో పీఎస్ఎల్వీ తన దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+