స్పేస్‌లో బేస్ బాల్ ఆడిన జపాన్ వ్యోమగామి.. వీడియో వైరల్ !
భూమిపై బేస్ బాల్ ఎవరైనా ఆడతారు.. కానీ అంతరిక్షంలో ఆడితేనే ఉంటుంది అసలు మజా అని అనుకున్నాడు జపాన్ కి చెందిన వ్యోమగామి. ఇక ఇందులో ఆశ్చర్యపోయే విషయం మరొకటి ఏంటంటే బాల్ ని తానే విసిరేసి.. మళ్లీ తానే స్ట్రైకింగ్ పొజిషన్ లోకి వచ్చి షాట్ కొట్టాడు. జీరో గ్రావిటీలో ఈ అదిరిపోయే ఫీట్ చేయడంతో ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ఈ వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్ ఆడారు. మొదట తానే బాల్ విసిరి.. ఆ తర్వాత మళ్లీ తానే వచ్చి బ్యాటర్ పొజిషన్ లో స్ట్రైక్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఇది బేస్‌బాల్ సీజన్. జపాన్‌లో మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ ప్రారంభమవుతోంది. జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పని లేదు అంటూ సరదాగా రాసుకొచ్చారు.

ఇక దాదాపు రెండు దశాబ్దాల నుంచి కోయిచి వకాటా వ్యోమగామిగా ఉన్నారు. 2024లో జేఏఎక్స్ఏ నుంచి ఆయన రిటైర్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఐదుసార్లు ఐఎస్ఎస్‌కు వెళ్లిన కోయిచి.. మొత్తంగా 500 రోజులు అంతరిక్షంలో గడిపినట్టు చెబుతున్నారు.
ఇటీవల ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ తిరిగి భూమి మీదకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోని ఎలాన్ మస్క్ రీట్వీట్ చేయడంతో భారతీయులు సైతం వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
— Elon Musk (@elonmusk) March 25, 2025












Click it and Unblock the Notifications