నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: బైడెన్‌పై బాంబు పేల్చిన మార్క్ జుకర్‌బర్గ్

Mark Zuckeberg: గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్‌.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటోన్నారు.

ఈ పరిణామాల మధ్య- సోషల్ మీడియా జెయింట్ మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ బాంబు పేల్చారు. అధ్యక్షుడు జో బిడెన్- ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సారథ్యంలోని ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురి చేసిందని, పదేపదే ఒత్తిళ్లకు గురి చేసిందని తేల్చి చెప్పారు.

Joe Biden-Kamala Harris administration repeatedly pressured me says Mark Zuckerberg

ప్రాణాంతక కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేకసార్లు ఒత్తిడి చేసిందని ఆరోపించారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీకి మార్క్ జుకర్‌బర్గ్ లేఖ రాశారు. రెండు పేజీల లేఖ ఇది. అమెరికా కాలమానం ప్రకారం.. ఈ నెల 26వ తేదీన జ్యుడీషియరీ కమిటీకి దీన్ని పంపించారు జుకర్‌బర్గ్.

ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు జుకర్‌బర్గ్. జో బైడెన్- కమలా హారిస్ ప్రభుత్వం అమెరికన్ల కోవిడ్ సమాచారాన్ని సెన్సార్ చేయమని ఫేస్‌బుక్‌పై ఒత్తిడి చేసిందని, బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వివాదాస్పద ల్యాప్‌టాప్ కథనాలను కూడా పోస్ట్ కానివ్వకుండా అడ్డుకుందని చెప్పారు.

ఈ మేరకు 2021లో వైట్ హౌస్‌ సీనియర్ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని వివరించారు. కోవిడ్‌పై సెటైరికల్ కామెంట్స్ మొదలుకుని ఎలాంటి కంటెంట్‌ అయినా సరే.. దాన్ని సెన్సార్ చేయమంటూ నెలల తరబడి పదేపదే ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేశారు.

వాటికి తలవంచాల్సి వచ్చిందని, కంటెంట్‌ను సెన్సార్ చేయడానికే తుది నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. కోవిడ్ కంటెంట్‌ను ఫేస్‌బుక్ నుంచి తొలగించాలా? వద్దా అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కొన్ని మార్పులతో అవి పోస్ట్ చెయ్యాల్సి వచ్చిందని అన్నారు.

స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలియజేయాల్సిన ఓ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఒత్తిడికి గురి చేయడం సరికాదని ఆయన చెప్పారు. తనకు వైట్ హౌస్ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టనందుకు చింతిస్తున్నానని జుకర్‌బర్గ్ ఈ లేఖలో స్పష్టం చేశారు.

ఆ సమయంలో ప్రభుత్వపరమైన ఒత్తిళ్ల కారణంగా తమ కంటెంట్ ప్రమాణాలపై రాజీ పడకూడదని నిర్ణయించుకున్నామని, ఇదే విషయాన్ని తన టీమ్‌కూ వివరించానని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వాటిని ఖచ్చితంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామనీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+