కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో మహా అద్భుతం.. ఇప్పుడే చూసేయండి..
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ రాత్రి ఆకాశంలో సూపర్ మూన్ కనువిందు చేస్తోంది. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోంది. నవంబర్ 5 న రాత్రి చంద్రుడు సాధారణ రోజుల కంటే మరింత పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా మెరిసిపోనున్నాడు. దీనిని బీవర్ సూపర్ మూన్ అని పిలుస్తుంటారు. పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరుకుంటాడు. ఆ సమయంలోనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది.
కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంటోంది. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా చేరుకున్నాడు. ఇప్పుడు చంద్రుడు.. భూమికి 3,57,000 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. సాధారణ రోజుల కంటే ఇవాళ దాదాపు 17 వేల కిలోమీటర్ల దగ్గరకు చేరుకున్నాడు. దీనివల్ల సాధారణ పౌర్ణమి కన్నా 7 శాతం పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు. అలాగే చంద్రుడు గతంలో కంటే 16 శాతం మరింత ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు.
అయితే చంద్రుడు ఇలా భూమి సమీపంలోకి రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. 2025 లో మొత్తం మూడుసార్లు సూపర్ మూన్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు పూర్తికాగా.. వచ్చే నెలలో మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్న నేపథ్యంలో మూడోసారి సూపర్ మూన్ ఏర్పడనుంది.
చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాడు. కాబట్టి భూమికి, చంద్రునికి మధ్య దూరం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. చంద్రుడు.. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అది ఆకాశంలో పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రంలో దీనిని పెరిజీ సిజిజీ అని పిలుస్తారు. ఇక సూపర్ మూన్ ప్రభావంతో సముద్రాల్లోని అలల తీవ్రతను కొద్దిగా పెరుగుతుందని సమాచారం. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎక్కడా ధృవీకరించలేదు.

ఇక సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిమాణం పెద్దదిగా ఉంటుంది. సాధారణ పౌర్ణమి చంద్రునితో పోల్చితే.. సూపర్ మూన్ సమయంలో చంద్రుడు దాదాపు 14 శాతం పెద్దగా.. అలాగే 30 శాతం ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications