LinkedIn: తెలుగులో అందుబాటులోకి వచ్చిన లింక్డ్‌ఇన్..!

ఒకప్పుడు ఉద్యోగాల కోసం నౌకరీ డాట్ కామ్, ఇన్ డీడ్ ఉండే ఉండేది. వీటి తర్వాత ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీ లోనే అదుబాటులో ఉన్న ఈ యాప్ గురువారం నుంచి నాలుగు భారతీయ ప్రాంతీయ భాషలతో సహా 10 కొత్త భాషల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. లింక్డ్‌ఇన్ కొత్తగా.. వియత్నామీస్, గ్రీక్, పర్షియన్, ఫిన్నిష్, హిబ్రూ, హంగేరియన్ అందుబాటులోకి వచ్చింది.

ఇక నాలుగు భారతీయ ప్రాంతీయ భాషలు అయిన బెంగాలీ, మరాఠీ, తెలుగు, పంజాబీలో కూడా లింక్డ్‌ఇన్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ భాషలకు సంబంధించి హిందీతో సహా ఐదు భారతీయ భాషల్లో లింక్డ్‌ఇన్ అందుబాటులో ఉంది. "లింక్డ్‌ఇన్ గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. లింక్డ్‌ఇన్ ను పది కొత్త భాషల్లో తీసుకొచ్చాం. ఇండియాలో లింక్డ్‌ఇన్ సబ్స్ క్రైబర్లు 135 మిలయన్లు ఉన్నారు" అని కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ టోమర్ కోహెన్ తెలిపారు.

LinkedIn is available in several regional languages besides Telugu

ఇండియాలో లింక్డ్‌ఇన్ వేగంగా వృద్ధి చెందుతోంది. తాజా అప్డేట్లతో లింక్డ్‌ఇన్ మొత్తం 36 భాషల్లో అందుబాటులో ఉంది. లింక్డ్‌ఇన్ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో కొనసాగుతోంది. కంపెనీ తాజాగా ఇండియాకు కొత్త మేనేజర్, ప్రొడక్ట్ హెడ్‌ గా కుమారేష్ పట్టాబిరామన్‌ను నియమించింది. కాగా లింక్డ్‌ఇన్ కొద్ది రోజుల క్రితం ఇండియాలో వీడియోల అప్ లోడ్ కూడా ప్రారంభించింది. లింక్డ్‌ఇన్ సభ్యులు ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా AI నైపుణ్యాలను ఉపయోగిస్తున్నారని కంపెనీ ప్రకటిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+