కన్యారాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం: హోలీ నాడే బ్లడ్ మూన్
Lunar eclipse 2025: హోలీ పండగ నాడే చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది కన్యారాశిలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. 14వ తేదీ నాడే హోలీ పౌర్ణమి కూడా కావడం- దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం- తెల్లవారు జామున 2:26 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 3:31 నిమిషాలకు ముగుస్తుంది. సుమారు 65 నిమిషాల పాటు భూమి ఛత్ర ఛాయలోకి వెళ్లిపోతుంది చందమామ. ఈ సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు.
మార్చి నెలలో ఏర్పడబోతోన్నందున ఈ చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. అలాగే- సంపూర్ణ గ్రహణ సమయంలో చందమామ పూర్తిగా ఎరుపు- ఆరెంజ్ మిశ్రమంలోకి మారడాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ రంగు మారడం అనేది భూ వాతావరణ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది.

ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించగలుగుతారు. అలాగే- యూరప్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తుంది.
అలస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఈ చంద్ర గ్రహణాన్ని స్పష్టంగా చూడొచ్చు. దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీల్లో ఇది కనిపిస్తుంది. పశ్చిమ యూరప్ రీజియన్‌లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలోని కేప్ వెర్డె, మొరాకో, సెనెగల్.. దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కనువిందు చేస్తుంది.
సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్ర గ్రహణంగా పిలుస్తారనే విషయం తెలిసిందే. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది.
చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణకాలంలో నేరుగా చంద్రుడిని చూడొచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. ఈ గ్రహణాన్ని నాసా లైవ్‌లో టెలికాస్ట్ చేయనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications