Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైక్రోసాఫ్ట్ లో సడన్ ఛేంజ్- సీఈఓగా భారతీయ టెక్కీ

మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగానికి కొత్త సీఈఓగా భారతీయ మహిళను నియమించింది. ఆమె పేరు ఆశా శర్మ. ఎక్స్ బాక్స్ (Xbox) చరిత్రలో ఇదో కీలక నాయకత్వ మార్పు. నాలుగు దశాబ్దాల తర్వాత పదవీ విరమణ చేయనున్నారు ప్రస్తుత గేమింగ్ హెడ్ ఫిల్ స్పెన్సర్. ఆయన స్థానంలో ఆశా శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. స్పెన్సర్.. ఈ వేసవి వరకు గేమింగ్ విభాగానికి అడ్వైజర్ గా కొనసాగుతారు. ఆదాయ వృద్ధి మందగించడం, ఖర్చుల పెరుగుదల, వరల్డ్ కన్సోల్, కంటెంట్ మార్కెట్‌లో తీవ్ర పోటీ మైక్రోసాఫ్ట్ గేమింగ్‌కు సవాళ్లు.

ఈ కీలక సమయంలో ఆశా శర్మ గేమింగ్ డివిజన్ చీఫ్ గా నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లకు ఆమె నేరుగా రిపోర్ట్ చేస్తారు. తన నియామకం పట్ల ఆశా శర్మ స్పందించారు. Xbox ప్రాధాన్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రధాన వినియోగదారులు, యూజర్ ఎంగేజ్మెంట్, కంటెంట్ డెవలప్మెంట్ పై దృష్టి కేంద్రీకరిస్తానని పేర్కొన్నారు. సబ్‌స్క్రిప్షన్‌, క్లౌడ్ గేమింగ్, భారీ కొనుగోళ్లతో మారుతున్న గేమింగ్ ప్రపంచంలో కంపెనీని ముందుకు నడిపిస్తానని ఆమె తెలిపారు.

Microsoft Appoints Indian Origin Asha Sharma as Gaming CEO After Spencer Departure after 38-Year

గతంలో ఆశా శర్మ అనేక టెక్ కంపెనీలలో సీనియర్ నాయకత్వ స్థానాల్లో పని చేశారు. మైక్రోసాఫ్ట్‌లో ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్, ప్రొడక్ట్ డివిజన్ లల్లో టీమ్ లీడర్ గా వ్యవహరించారు. సంస్థ AI విస్తరణ విషయంలో ఆమెకు అపారమైన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే- దాదాపుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం అధికంగా ఉండే గేమింగ్ విభాగానికి ఆమెను సీఈఓగా నియమించింది మైక్రోసాఫ్ట్.

అంతకుముందు- ఇన్‌స్టాకార్ట్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, మెటాలో ప్రొడక్ట్ లీడింగ్ లో ఆశా శర్మ బాధ్యతలు నిర్వర్తించారు. తనకు అప్పగించిన ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా కార్ల్‌సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ డిగ్రీని పొందారు ఆశా. ఆమె నియామకంతో పాటు, మైక్రోసాఫ్ట్ ఇతర సీనియర్ లెవెల్ ఉద్యోగుల్లో కీలక మార్పులు చేసింది. మ్యాట్ బూటీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఆయన గేమ్ స్టూడియోలు, టైటిళ్లను పర్యవేక్షిస్తారు.

మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఇటీవల అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. గత త్రైమాసికాల్లో గేమింగ్ ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరగడంతో హార్డ్‌వేర్ తడిచి మోపెడవుతోంది. అదే సమయంలో- 2023లో 69 బిలియన్ల డాలర్ల భారీ ఒప్పందంతో కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ ఇంకా సెంట్రలైజ్డ్ చేయాల్సి ఉంది. గేమింగ్ ఇండస్ట్రీలో మైక్రోసాఫ్ట్ స్థానాన్ని పూర్తిగా మార్చేసిందీ డీల్. కన్సోల్ మార్కెట్ వాటా విషయంలో సోనీ ప్లేస్టేషన్ నుండి బలమైన పోటీని ఎదుర్కొంటోంది ఎక్స్ బాక్స్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+