ISRO 100 not out:నింగిలోకి NVS-02 ఉపగ్రహం పంపిన ఇస్రో-100వ శాటిలైట్ సక్సెస్..!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో సెంచరీ కొట్టింది.ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100వ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది.ఇస్రో ఛైర్మన్ గా వి.నారాయణన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం.ఈ GSLV మిషన్ ను ఇస్రో.. బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగిలోకి పంపింది.

ఇస్రో దేశీయంగా అభివృద్ధి చేసిన GSLV-F15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది.ఈ మిషన్ సక్సెస్ కావడంతో భారత నేవిగేషన్ వ్యవస్థ మరింత బలపడిందని శాస్త్రవేత్తలు చెప్పారు.50.9 మీటర్ల పొడవున్న GSLV-F15 రాకెట్.. GSLV-F12 మిషన్ కు కొనసాగింపుగా ఉంది. ఇక NVS-02 ఉపగ్రహాన్ని యూఆర్ శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీని బరువు 2,250 కేజీలు ఉంది.

Milestone Moment ISRO Launches 100th Satellite NVS-02 from Sriharikota

NVS-02 అనే ఈ ఉపగ్రహం NVS శ్రేణిలో రెండవది.భారత నేవిగేషన్ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తుంది.కచ్చితమైన పొజిషన్,వేగం, టైమింగ్‌లాంటి సేవలను భారత్‌లో ఉన్న యూజర్లకు అందిస్తుంది.అంతేకాదు భారత భూభాగంకు 1500 కిలోమీటర్ల అటువైపు దూరం వరకు కూడా ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. రెండవ తరం రాకెట్ తయారీలో NVS శ్రేణిలో ప్రయోగించిన తొలి రాకెట్ NVS-01 కాగా రెండవది NVS-02.NVS-01 2023 మే 29న ప్రయోగించారు.

NVS-02 ప్రయోగం విజయవంతం కావడంతో శాటిలైట్ టెక్నాలజీలో మరిన్ని మిషన్ల ప్రయోగంకు మార్గం సుగమమైనట్లయ్యింది.భవిష్యత్తులో అంటే 2028లో అంగారకుడిపైకి రోసాలిండ్ ఫ్రాంక్లిన్ అనే రోవర్‌ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం కాన్ఫిడెన్స్‌‌ను ఇచ్చినట్లయ్యింది.అంతేకాదు నేవిగేషన్ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఈ ప్రయోగం ఎంతో తోడ్పడుతుందని అంతరిక్షరంగ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+