Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.14,999కే " Moto G67 Power 5G ".. 7000 mAh బ్యాటరీ, 50ఎంపీ సోనీ కెమెరా !!

మోటారోలా మొబైల్స్ కి ఇండియన్ మార్కెట్లో సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తమ వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'జీ సిరీస్'లో భాగంగా లేటెస్ట్ గా "మోటో జీ67 పవర్" 5జీ (Moto G67 Power 5G) అనే మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో పాటు భారీ బ్యాటరీ, సోనీ సెన్సార్ కెమెరా, Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో మంచి ఛాయిస్ గా నిలుస్తోంది. ఈ తరహా ఫీచర్లతో రూ.15 వేల ధరలోనే అందుబాటులో ఉండటం బాగా కలిసొచ్చే అంశం. నవంబర్ 12 నుంచి ఈ ఫోన్ మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, మరియు రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు బాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

moto-g67-power-5g-price-and-specifications-details

Moto G67 Power 5G ఫీచర్స్..

డిస్‌ప్లే & డిజైన్..

మోటో జీ67 పవర్ 5జీ లో 6.7 అంగుళాల Full HD+ pOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కాబట్టి స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటంతో స్క్రీన్ స్క్రాచ్‌లకు, చిన్న దెబ్బలకు రక్షణ కల్పిస్తుంది. ఫోన్ స్లీక్, ప్రీమియం లుక్‌లో ఉండనుంది.

కలర్స్..

మూడు ఆకర్షణీయమైన పెంటగాన్ క్యూరేటెడ్ కలర్స్‌లో (మిడ్‌నైట్ బ్లూ, గ్రాఫైట్ గ్రే, పాస్టెల్ గ్రీన్) అందుబాటులో ఉంటుంది.

ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌ను అమర్చారు, ఇది 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడింది. ఈ ప్రాసెసర్ గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఫోన్ Android 15 ఆధారిత Hello UX ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. మోటోరోలా ఈ మోడల్‌కు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్, 2 ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించనున్నట్లు తెలిపింది.

కెమెరా ఫీచర్లు..

కెమెరా విభాగంలో ఈ ఫోన్ తన విభాగంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

50 MP Sony LYT-600 సెన్సార్ (OIS తో)

8 MP అల్ట్రావైడ్ + మాక్రో లెన్స్

ఫ్రంట్ కెమెరా: 32 MP సెల్ఫీ కెమెరా, HDR, నైట్ మోడ్ సపోర్ట్‌.

బ్యాటరీ & ఛార్జింగ్..

మోటో జీ67 పవర్ 5జీ లో 7000 mAh భారీ బ్యాటరీను అందించారు. 30W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. కంపెనీ ప్రకారం ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 2 రోజులకు పైగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..

5G SA/NSA డ్యూయల్ మోడ్ సపోర్ట్

Wi-Fi 6, Bluetooth 5.3, NFC, GPS

సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

IP52 వాటర్ రిపెలెంట్ డిజైన్

స్టీరియో స్పీకర్లు, Dolby Atmos ఆడియో సపోర్ట్

3.5mm ఆడియో జాక్ కూడా కల్పించారు

మెమరీ & స్టోరేజ్ ఆప్షన్లు..

8GB LPDDR5 RAM + 128GB స్టోరేజ్ - ధర రూ.15,999

8GB + 256GB వేరియంట్ - త్వరలో లభ్యం

(మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు)

ధర & లభ్యత..

లాంచ్ ఆఫర్ కింద 8GB + 128GB వేరియంట్‌ను రూ.14,999కే పొందవచ్చు. కొనుగోలుదారులకు బాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

నవంబర్ 12 నుంచి ఈ ఫోన్ మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, మరియు రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+