Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిర్రాక్ ఫీచర్స్‌తో "Moto Edge 70 Fusion"..

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే మోటోరోలా మరో కొత్త ప్రీమియం ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయనుంది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సన్నని డిజైన్‌, పెద్ద బ్యాటరీ కాంబోలో రావడం అంటే కష్టమనే చెప్పాలి. కానీ అసాధ్యం అనుకునే వారికి మోటోరోలా సమాధానం చెప్పింది. ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Moto Edge 70 Fusion ను అధికారికంగా ప్రవేశపెట్టింది. సన్నని డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, ప్యాంటోన్ ధృవీకరించిన కెమెరాలతో ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తోంది. స్టైల్, పనితీరు, మన్నిక.. ఇవన్నీ ఒకే ఫోన్‌లో అందించడం ఈ మోడల్ ప్రత్యేకత. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

motorola-launched-new-smart-phone-edge-70-fusion-with-amazing-features-and-reasonable-price

Moto Edge 70 Fusion ఫీచర్స్..

డిజైన్ & బ్యాటరీ..

గత ఎడ్జ్ 70 మోడల్ 6.0మి.మి. మందంతో 4,800mAh బ్యాటరీని అందించింది. కానీ ఈసారి ఫ్యూజన్ వెర్షన్ 7.2మి.మి. మందంతోనే 5,200mAh బ్యాటరీని అందిస్తోంది.

మునుపటి ఎడ్జ్ 60 (7.9మి.మి., 5,200mAh) మరియు ఎడ్జ్ 60 ఫ్యూజన్ (8.0మి.మి. నుంచి) కంటే ఇది మరింత సన్నగా, మరింత సమతౌల్యంగా రూపొందించబడింది. బరువు కేవలం 177 గ్రాములు మాత్రమే ఉండటంతో చేతిలో తేలికగా అనిపిస్తుంది.

భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెర్షన్ 7.99మి.మి. మందంతో భారీ 7,000mAh బ్యాటరీని కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణ. అంటే భారతీయ వినియోగదారుల కోసం ఎక్కువ బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టినట్లు స్పష్టం.

ప్రాసెసర్..

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ అమర్చబడింది. TSMC N4 ప్రాసెస్ ఆధారంగా రూపొందించిన ఈ చిప్‌సెట్‌లో Cortex-A720, A520 కోర్‌లు ఉన్నాయి. గత మోడల్ కంటే సుమారు 15% వేగవంతమైన పనితీరు అందిస్తుంది. Adreno 810 GPU గేమింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మార్చుతుంది. గతంలో ఉపయోగించిన డిమెన్సిటీ 7300తో పోలిస్తే గ్రాఫిక్స్, మల్టీటాస్కింగ్, పవర్ ఎఫిషెన్సీ మెరుగుపడ్డాయి.

డిస్ ప్లే & డిజైన్..

క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లే - 5,200 నిట్స్ బ్రైట్‌నెస్

6.78 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఈ ఫోన్ హైలైట్. 1272p+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు, గేమ్స్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి.

అత్యధికంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్ అందించడం ద్వారా ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ లభిస్తాయి. ముందు భాగంలో Gorilla Glass 7i రక్షణ ఇవ్వబడింది.

ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో ధూళి, నీటి నిరోధకతను కలిగి ఉంది. అదనంగా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ టెస్టింగ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. అంటే రోజువారీ వినియోగంలో పడే దెబ్బలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉంది.

కెమెరా..

వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ అమర్చబడింది.

50MP Sony Lytia 710 ప్రధాన సెన్సార్ (OIS మద్దతుతో)

13MP అల్ట్రా వైడ్ లెన్స్ (120° వీక్షణ కోణం, మాక్రో సపోర్ట్)

సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ప్యాంటోన్ కలర్ వెరిఫికేషన్‌తో ఫోటోలలో సహజ రంగులు లభిస్తాయి.

ఛార్జింగ్ & ఇతర ఫీచర్లు..

68W వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్

వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

స్టీరియో స్పీకర్లు (Dolby Atmos సపోర్ట్ ఉండే అవకాశం)

తాజా Android వెర్షన్‌తో క్లీన్ UI అనుభవం

రంగులు..

ప్యాంటోన్ బ్లూ సర్ఫ్, ప్యాంటోన్ సిల్హౌయెట్, ప్యాంటోన్ కంట్రీ ఎయిర్ వంటి ఫ్యాబ్రిక్-ప్రేరిత ముగింపులతో లభిస్తుంది. ఈ కలర్స్ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి.

యూరప్ vs ఇండియా వెర్షన్..

యూరప్ మార్కెట్ కోసం సన్నని, స్టైలిష్ వెర్షన్ అందుబాటులో ఉండగా, భారత మార్కెట్ కోసం భారీ బ్యాటరీతో కూడిన వెర్షన్ తీసుకొస్తున్నారు. అంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ మార్పులు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+