"నథింగ్ ఫోన్ 3a లైట్" లాంఛ్.. బెస్ట్ ఫీచర్స్, ధర ఎంతంటే ??

టెక్‌ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టినప్పటి నుంచి "నథింగ్‌" సంస్థ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్పెషల్ డిజైన్‌ తో కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈ ఫోన్ ఇప్పటికే సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరుచుకుంది. "నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2"లతో మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక బలమైన ఇంపాక్ట్ సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్ గా నథింగ్ కంపెనీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ "నథింగ్ ఫోన్ 3a లైట్"ను అధికారికంగా (అక్టోబర్ 29, 2025) నేడు విడుదల చేయబోతోంది.

ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా భారత మార్కెట్‌తో సహా లాంచ్ కానుంది. మధ్యాహ్నం 1 PM GMT (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30) గంటలకు లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఇది ప్రత్యేక ఆన్‌లైన్ ఈవెంట్‌గా ఉంటుందా లేదా సాధారణ డిజిటల్ ప్రకటన రూపంలోనా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

nothing-phone-3a-lite-launching-today-and-price-features-details

నథింగ్ ఫోన్ 3a లైట్ ఫీచర్స్..

డిజైన్..

నథింగ్ ఫోన్ సిరీస్ ప్రత్యేకతగా నిలిచిన "గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లైటింగ్ సిస్టమ్"కు బదులుగా, 3a లైట్‌లో కేవలం ఒకే LED డాట్ లైట్ వెనుక భాగంలో అమర్చారు. "Light up the everyday" అనే ట్యాగ్‌లైన్‌ కింద వస్తున్న ఈ కొత్త డిజైన్ ప్రధానంగా నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్ వంటి ప్రాథమిక అలర్ట్‌లను చూపించడానికి మాత్రమే ఉపయోగపడనుంది.

ధర & లభ్యత..

లీక్ అయిన సమాచారం ప్రకారం, ఫ్రాన్స్‌లో EUR 249.99 (సుమారు రూ.25,700) ప్రారంభ ధరగా ఉండొచ్చు. కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇది కొంచెం తక్కువగా, EUR 239.99 (రూ.24,700) వద్ద కూడా లభించవచ్చు. యూరప్‌లో నవంబర్ 4 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కొన్ని రిపోర్ట్‌లు దీని ధర రూ.18,999 నుండి రూ.22,999 మధ్య ఉండవచ్చని సూచిస్తున్నాయి.

రంగులు..

ఈ ఫోన్ బ్లాక్ & వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.

డిస్‌ప్లే..

నథింగ్ ఫోన్ 3a లైట్‌లో 6.77 అంగుళాల Full HD+ AMOLED LTPS డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉండనున్నాయి.

పనితీరు..

ఈ డివైజ్ MediaTek Dimensity 7300 లేదా Dimensity 7300 Pro చిప్‌సెట్, Mali-G615 MC2 GPUతో వస్తుందని అంచనా. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి వస్తుంది.

సాఫ్ట్ వేర్..

ఇది ఆండ్రాయిడ్ 15 తో రన్ అయ్యే ఫోన్. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం నథింగ్ ఫోన్ 3a లైట్ Android 15 OSపై రన్ అవుతుంది. ఇది సింగిల్ కోర్ టెస్టుల్లో 1,003 పాయింట్లు, మల్టీకోర్ టెస్టుల్లో 2,925 పాయింట్లు సాధించింది. నథింగ్ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియెన్స్‌లో ప్రధానంగా స్వచ్ఛమైన, ల్యాగ్ ఫ్రీ UIని కొనసాగించనుంది.

కెమెరా..

ఈ బడ్జెట్ మోడల్ అయినప్పటికీ, కెమెరా విభాగంలో నథింగ్ రాజీ పడలేదు. వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

50MP ప్రైమరీ సెన్సార్

50MP అల్ట్రా వైడ్ లేదా టెలిఫోటో లెన్స్

ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ (30fps) సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

బ్యాటరీ & ఛార్జింగ్..

పవర్ కోసం ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. USB Type-C పోర్ట్, రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండవచ్చని లీక్ సమాచారం సూచిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+