అదిరిపోయే ఫీచర్లతో OnePlus 15.. లాంఛ్ ఎప్పుడంటే ?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్.. తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ OnePlus 15 ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌ను 2025 అక్టోబర్‌లో చైనాలో లాంచ్ చేసి, ఆ తర్వాత 2026 ప్రారంభంలో భారతదేశం సహా ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయనుంది.
ఈ ఫోన్‌తో పాటు OnePlus Ace 6 కూడా పరిచయం అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ విడుదలైన తర్వాత కంపెనీ OnePlus 15R అనే మీడియం బడ్జెట్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

OnePlus 15 ఫీచర్లు..
డిస్‌ప్లే & డిజైన్..
వన్‌ప్లస్ 15 డిస్‌ప్లే విభాగంలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో రానుంది. ఇందులో 6.78-అంగుళాల LTPO AMOLED 2K రిజల్యూషన్ స్క్రీన్ ఉండవచ్చు. అలాగే 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ లభించనుందని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వంటి ప్రీమియం ఫోన్లకు నేరుగా పోటీ ఇవ్వగల సామర్థ్యం కలిగిన డిస్‌ప్లేగా భావిస్తున్నారు.
ప్రాసెసర్ & పనితీరు..
ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite 2 చిప్‌సెట్ పనిచేయనుంది. ఇది 2025లో అందుబాటులోకి రానున్న అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ ప్రాసెసర్‌గా భావిస్తున్నారు. దీనితో పాటు కస్టమ్ Orion CPU, Adreno 840 GPU, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. అంతేకాకుండా, పనితీరును పెంచడానికి ప్రత్యేకమైన 16MB కాష్ మెమరీ కూడా అందించనున్నట్లు లీక్‌లు వెల్లడిస్తున్నాయి. స్టోరేజ్ ఆప్షన్స్ విషయానికి వస్తే 16GB వరకు RAM, 1TB వరకు ROM అందించనున్నట్లు తెలుస్తోంది.
కెమెరా అప్‌గ్రేడ్‌లు..
వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండనుంది. ఇందులో 50MP ప్రైమరీ LYT700 సెన్సార్ (OISతో), 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటుందని లీక్‌లు చెబుతున్నాయి. పెరిస్కోప్ కెమెరా అప్‌గ్రేడ్ వల్ల వన్‌ప్లస్ 15 జూమ్ పనితీరు మరింత శార్ప్‌గా, డీటైల్‌గా మారనుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా లభించనుంది.
బ్యాటరీ & ఛార్జింగ్..
బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ 15 భారీ అప్‌గ్రేడ్‌తో రానుంది. ఈ ఫోన్‌లో 7,300mAh బ్యాటరీ అందించనున్నట్లు సమాచారం. అలాగే 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. దీని వల్ల ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్‌తో పాటు, వేగవంతమైన ఛార్జింగ్ అనుభవం లభిస్తుంది.
OnePlus 13తో పోలిక..
ఇప్పటికే విడుదలైన OnePlus 13 తో పోలిస్తే, OnePlus 15 గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందించనుంది. వన్‌ప్లస్ 13లో 6.7-అంగుళాల 120Hz ప్యానెల్ ఉండగా, 15లో 6.78-అంగుళాల 165Hz డిస్‌ప్లే వస్తుంది. అలాగే, OnePlus 13లో 48MP పెరిస్కోప్ లెన్స్ మాత్రమే ఉండగా, వన్‌ప్లస్ 15లో 64MP టెలిఫోటో లెన్స్‌తో మరింత శక్తివంతమైన జూమ్ ఫీచర్లు లభించనున్నాయి.
ప్రత్యేకతలు & ధర అంచనా
OnePlus 14 మోడల్‌ను పూర్తిగా దాటేసి నేరుగా 15వ తరం ఫోన్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. భారత మార్కెట్‌లో వన్‌ప్లస్ 15 రూ.80,000 వరకు ధర ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం, వన్‌ప్లస్ 15 డిజైన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ అన్ని విభాగాల్లోనూ గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందించబోతోంది. ఇది విడుదలైతే, 2026లో ప్రీమియం ఆండ్రాయిడ్ మార్కెట్లో సామ్‌సంగ్, ఐఫోన్‌లకు బలమైన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications