El Nino: ఉడికిపోతున్న పసిఫిక్ మహాసముద్రం.. ఆల్ టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రత

ప్రపంచ వాతావరణాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రంలో ఎన్నడూ లేనివిధంగా ఊహకందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్య పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో ఎగిసిపడుతున్నాయి. క్లైమేట్ రీఅనలైజర్ లెక్కల ప్రకారం.. నిపుణులు అత్యంత కీలకంగా భావించే నినో 3.4 ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 3.46 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదైంది. గత చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ముంచెత్తుతున్న 'ఎల్ నినో' ప్రభావం..

సముద్రం అడుగున జరిగే ఈ అనూహ్య పరిణామాల వెనుక 'ఎల్ నినో' ప్రభావం బలంగా పనిచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో వేడి నీటి ప్రవాహాలు విస్తరించినప్పుడు ఈ వాతావరణ మార్పు ఏర్పడుతుంది. అక్టోబర్ నెలలోనే ఈ ప్రాంతంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరడం లేదా దాటడం జరుగుతోంది. 1991-2020 మధ్యకాలపు సగటుతో పోలిస్తే ఈ పెరుగుదల చాలా తీవ్రంగా ఉండటంతో, రాబోయే 2026-27 కాలంలో ఎల్ నినో రూపంలో పెను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి.

Pacific Ocean Temperature Record Shattered Rising El Nino Heat Sparks Global Weather Warning For 2026-27
El Nino: కర్నూలులో తీవ్ర కరువు.. ఊళ్లకు ఊళ్లే ఖాళీ!
El Nino: కర్నూలులో తీవ్ర కరువు.. ఊళ్లకు ఊళ్లే ఖాళీ!

అధికారిక ధృవీకరణ కోసం నిపుణుల నిరీక్షణ

ఈ తాజా గణాంకాలు ఒక రోజు ప్రాతిపదికన వచ్చిన సంచలన రీడింగ్ అయినప్పటికీ, అధికారిక నెలవారీ సూచికలతో పోల్చడానికి కొన్ని సాంకేతిక తేడాలుంటాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన నోవా (NOAA) సంస్థ నివేదిక ప్రకారం అక్టోబర్‌లో నెలవారీ నినో 3.4 అసమతూల్యత +2.1 డిగ్రీలకు చేరుకుందని, ఇది 2027 జనవరి-మార్చి నాటికి మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినప్పటికీ, ఈ సరికొత్త రికార్డు ఉష్ణోగ్రత మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై సైంటిస్టులు నిరంతరం కన్నేసి ఉంచారు.

చుక్క నీరు కూడా దొరకదు! పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు
చుక్క నీరు కూడా దొరకదు! పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు

ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం!

అతి శక్తివంతమైన ఎల్ నినో ప్రభావం కేవలం సముద్రానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను తలకిందులు చేసే ప్రమాదం ఉంది. భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో రుతుపవనాల సరళి మారుతుందని, విపరీతమైన ఎండలు, కరవులు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు ఉష్ణోగ్రతను బట్టి కచ్చితమైన అంచనాకు రాలేకపోయినా, పసిఫిక్ సముద్రంలో జరుగుతున్న ఈ మార్పులు భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు పెను సవాళ్లను విసరడం ఖాయమని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+