Vikram-1: హైదరాబాద్ లో ఏరోస్పేస్ క్యాంపస్-తొలి ప్రైవేట్ రాకెట్ ఆవిష్కరించిన మోడీ..!
అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచిన కేంద్రం.. ఇందులో భాగంగా దేశంలో జరుగుతున్న పరిశోధనల్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ లో నిర్మించిన ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1ను కూడా ఆవిష్కరించారు.
హైదరాబాద్ లోని ఇమారత్ లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఈ క్యాంపస్ ను అభివృద్ధి చేసింది. ఇందులోనే తొలి దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఇవాళ ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇది లో ఎర్త్ ఆర్బిట్‌లోకి బహుళ-ఉపగ్రహ విస్తరణ సామర్థ్యం కలిగి ఉంటుంది. 2 లక్షల చదరపు అడుగుల ఈ క్యాంపస్ నెలవారీ ప్రయోగ సామర్థ్యంతో ఎండ్-టు-ఎండ్ రాకెట్ ఉత్పత్తికి అనుకూలంగా ఏర్పాటు చేశారు.

అంతరిక్ష ప్రయోగాల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీద అధునాతన కార్బన్-ఫైబర్ టెక్నాలజీతో విక్రమ్-I ప్రైవేట్ రాకెట్ ను తయారు చేశారు. ప్రపంచ చిన్న ఉపగ్రహ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని దీన్ని అభివృద్ధి చేసారు. తొలి దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ను ఓ సాంకేతిక అద్భుతంగా చెప్తున్నారు. ఇది తక్కువ ఎత్తు భూకక్షకు దాదాపు 300 కిలోల పేలోడ్‌లను మోసుకెళ్లడానికి వీలుగా తయారు చేశారు. ఈ శ్రేణిలో ఇతర రాకెట్లకు భిన్నంగా పూర్తిగా కార్బన్-ఫైబర్ బాడీతో దీన్ని నిర్మించారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఉమ్మడిగా స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్ద.. 2030 నాటికి భారతదేశాన్ని అంతరిక్ష ప్రయోగాల్లో మేటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.

ఇవాళ ఈ కార్యక్రమాల్లో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోడీ.. దశాబ్దాలుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి శక్తినిచ్చినందుకు ఇస్రోను ప్రశంసించారు. దాని విశ్వసనీయత, సామర్థ్యం, ప్రత్యేకమైన ప్రపంచ గుర్తింపును రూపొందించడంలో విలువైన సంస్థగా దీన్ని అభివర్ణించారు. ప్రైవేట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని ప్రధాని తెలిపారు. యువత ఆవిష్కరణలు, రిస్క్ తీసుకోవడం , వ్యవస్థాపకత కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని మోడీ పేర్కొన్నారు.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications