10000mAh బ్యాటరీతో సూపర్ ఫోన్‌ను తీసుకొస్తున్న రియల్ మీ..!
రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. బెస్ట్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన రియల్‌మీ మొబైల్ ఫోన్లు సరసమైన ధరలకే లభ్యమవుతున్నాయి. దీంతో పాటు స్టైలిష్ డిజైన్ లలో కూడా స్మార్ట్ ఫోన్స్ వస్తుండడంతో టెక్ ప్రియులు ఈ ఫోన్లపై మనసు పారేసుకుంటున్నారు. భారత మార్కెట్‌లో రియల్ మీకి విశేష ఆదరణ ఉందని చెప్పొచ్చు.
ఇక స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రోజుకో కొత్త ఆవిష్కరణ జనాలను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రియల్‌మీ ఇప్పుడు మరో ముందడగు వేసి తన GT కాన్సెప్ట్ ఫోన్‌తో సంచలనం సృష్టించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ను 10,000mAh భారీ బ్యాటరీతో తీసుకు రాబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. 320W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో.. స్టైలిష్ డిజైన్ తో ఈ ఫోన్ తీసుకురానున్నారు. ఇది వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తూ నిరంతర వినియోగానికి వీలుగా ఉంటుందని ప్రకటించారు.

ఈ ఫోన్‌లో ఉన్న AMOLED డిస్ ప్లే.. అధిక రిఫ్రెష్ రేట్‌తో సహా HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుందని వెల్లడించారు. ఇది వీడియోలు, గేమింగ్‌కు అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ చిప్‌సెట్‌తో రూపొందించిన ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్, ఫోటోగ్రఫీ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు.
అంతే కాకుండా కెమెరా విషయంలో కూడా కస్టమర్లను నిరుత్సాహపరచమని చెబుతున్నారు. అల్ట్రావైడ్, మ్యాక్రో లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉండనుందని.. సెల్ఫీ కెమెరాతో కూడా ఉత్తమమైన క్లారిటీని అందిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, సన్నని డిజైన్, బెస్ట్ కెమెరా ఇలా ఒకే ఫోన్ లో ఫీచర్స్ తీసుకురావడం అంటే ఇతర బ్రాండ్లకు పెద్ద సవాలుగా మారే అవకాశముందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications