"రియల్‌మీ" నుంచి పీ4 5జీ, ప్రో 5జీ ఫోన్స్ లాంఛ్.. ఎంతంటే ?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న కంపెనీ రియల్‌మీ. తక్కువ సమయంలోనే భారత మార్కెట్‌లో టాప్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. భారీ బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన డిస్‌ప్లేలు, బెస్ట్ కెమెరాతో రియల్‌మీ ఫోన్లు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రియల్‌మీ తాజాగా తన P సిరీస్లో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మీ P4 5జీ, రియల్‌మీ P4 ప్రో 5జీ పేరుతో రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ రెండూ AMOLED డిస్‌ప్లేలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. మిడ్‌రేంజ్ ధరలోనే మొబైల్స్‌ను తీసుకురావడంతో టెక్ ప్రియులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. రెండు మోడళ్లను వీసీ కూలింగ్ యూనిట్ సదుపాయంతో తీసుకురావడం గేమింగ్ ఇష్టపడే వారిని కూడా ఆకర్షిస్తోంది.

రియల్‌మీ P4 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే..
-
6.8 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే
- 144Hz రిఫ్రెష్‌రేట్
- 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్
ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్..
- Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్
- Android 15 ఆధారిత Realme UI 6
కెమెరాలు..
- వెనుక కెమెరాలు: 50MP Sony IMX896 ప్రధాన + 8MP అల్ట్రా వైడ్
- సెల్ఫీ కెమెరా: 50MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ & ఛార్జింగ్..
- 7,000mAh భారీ బ్యాటరీ
- 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
- 10W రివర్స్ ఛార్జింగ్
కలర్స్..
- Birch Wood
- Dark Oak Wood
- Midnight Ivy
రియల్‌మీ P4 5జీ స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే..
- 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే
- 144Hz రిఫ్రెష్‌రేట్
- 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్..
- MediaTek Dimensity 7400 ప్రాసెసర్
- Android 15 ఆధారిత Realme UI 6
కెమెరాలు..
- వెనుక కెమెరాలు: 50MP ప్రధాన + 8MP అల్ట్రా వైడ్
- సెల్ఫీ కెమెరా: 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ & ఛార్జింగ్..
- 7,000mAh బ్యాటరీ
- 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
- 10W రివర్స్ ఛార్జింగ్
ధరలు & వేరియంట్లు..
రియల్‌మీ P4 5జీ..
6GB + 128GB - రూ.18,499
8GB + 128GB - రూ.19,499
8GB + 256GB - రూ.21,499
కస్టమర్లకు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 2,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.వెయ్యి ఎక్స్ఛేంజ్ బోనస్‌గా పొందొచ్చు. ఆగస్టు 25 మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.
రియల్‌మీ పీ4 ప్రో 5జీ ..
8GB + 128GB - రూ.24,999
8GB + 256GB - రూ.26,999
12GB + 256GB - రూ.28,999
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3 వేలు రాయితీ పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.2 వేల బోనస్ పొందొచ్చు. ఈ మోడల్‌ను ఆగస్టు 27 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ రెండు ఫోన్లు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.












Click it and Unblock the Notifications