యాపిల్ ఐ ఫోన్‌లో " I " అంటే ఏంటో తెలుసా..?
ప్రపంచంలో టెక్ ప్రియులందరికీ Apple iPhone అంటే ఒక కల. టెక్ దిగ్గజం యాపిల్ రూపొందించే ఐఫోన్ లకు మార్కెట్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది ఐ ఫోన్. కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్, సురక్షితమైన iOS సిస్టమ్‌తో ఐఫోన్ మార్కెట్ ని పెంచుకుంటుంది. ఆధునిక సాంకేతికతకు, ప్రీమియం లైఫ్‌స్టైల్‌కు ప్రతీకగా మారిన ఈ ఫోన్ కేవలం ఒక గాడ్జెట్ గానే కాకుండా ఒక స్టేటస్ సింబల్ గా కూడా పరిగణిస్తారు.
అంతే కాకుండా ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ, పనితీరు, iOS కారణంగా ఐఫోన్ మార్కెట్లో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కాగా మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు భారత్‌లోనూ ఐఫోన్ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈఎంఐలో కొని మరీ ఐ ఫోన్స్ కొనుగోలు చేస్తూ "ప్రెస్టీజీ"గా భావిస్తున్నారు.

ఐఫోన్ పేరుకి వెనుక ఉన్న రహస్యం..
అయితే "i Phone" అనే పేరులోని "i" అక్షరం అర్థం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సాధారణంగా ఆపిల్ మొబైల్ ఫోన్లకు పేరు పెట్టేటప్పుడు i అనే అక్షరాన్ని ఉపయోగించడానికి పెద్ద స్టోరీ ఉందట. i అంటే ఇంటర్నెట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ అనే పేరులోని i అనే అక్షరం వెనుక దాగి ఉన్న రహస్యం బయటపెట్టారు.
స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ.. ఐఫోన్ పేరులోని i అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్. అంటే ఒక అక్షరం వెనుక ఐదు ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయని తెలుస్తోంది.
Internet - ప్రపంచాన్ని కనెక్ట్ చేసే శక్తి
Individual - వ్యక్తిగత అనుభవాన్ని ప్రతిబింబించే గుర్తు
Instruct - నేర్పించాలనే ఉద్దేశ్యం
Inform - సమాచారం అందించే సాంకేతికత
Inspire - ప్రేరణనిచ్చే ఆవిష్కరణ
1998లో మొదటగా iMac కంప్యూటర్‌ను ఆవిష్కరించినప్పుడు జాబ్స్ "i" అక్షరానికి అర్థం వివరించారు. ఆయన ప్రకారం, "i" అంటే కేవలం Internet మాత్రమే కాదు, దానికి ఐదు ప్రత్యేక అర్థాలున్నాయి.
కాగా Apple మొదటగా iMac, తర్వాత iPod, iTunes, iPad, చివరగా iPhone వంటి పరికరాల్లో "i" అక్షరాన్ని ఉపయోగించింది. ప్రతి ఉత్పత్తిలో కూడా వినియోగదారుడికి సులభతరం, వ్యక్తిగతం, మరియు స్మార్ట్ అనుభవం ఇవ్వడమే లక్ష్యం. 2007లో మొదటి iPhone విడుదలైనప్పటి నుంచి ప్రపంచ మొబైల్ టెక్నాలజీని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతానికి Apple ప్రపంచంలో 1.5 బిలియన్ పైగా యాక్టివ్ ఐఫోన్ వినియోగదారులు ఉన్నారని అంచనా. భారత మార్కెట్లో Apple ఇటీవల తమ ఉత్పత్తులను Make in India కింద తయారు చేయడం ప్రారంభించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications