108MP కెమెరా, 5520mAh బ్యాటరీతో "Redmi Note 15 series"..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. కాగా 5G ఫోన్‌ల ధరలు సాధారణంగా రూ.14,000-రూ.16,000 వరకు ఉండగా.. రెడ్‌మీ మాత్రం తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 15 ను భారత మార్కెట్లో జనవరి 6, 2026న విడుదల చేయడానికి సిద్ధమైంది. నోట్ సిరీస్‌కు భారత వినియోగదారుల్లో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, ఈసారి మరింత అప్‌గ్రేడ్ ఫీచర్లతో ఫోన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ, సూపర్ స్లిమ్ బాడీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్.. భారత వెర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే భారత్‌లో లాంచ్ కానున్న నోట్ 15, చైనా మోడల్‌తో పోలిస్తే కొన్ని కీలక మార్పులతో వస్తోంది. కెమెరా, సాఫ్ట్‌వేర్, డిజైన్ సెగ్మెంట్‌లోని కొన్ని స్పెసిఫికేషన్‌లు భారత మార్కెట్ అభిరుచులకు తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేశారని కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

రెడ్‌మీ నోట్ 15 సిరీస్..
- నోట్ 15
- నోట్ 15 ప్రో
- నోట్ 15 ప్రో ప్లస్
మోడల్స్ ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 15 సిరీస్ ఫీచర్స్..
డిస్ ప్లే..
రెడ్‌మీ నోట్ 15లో 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
హై బ్రైట్‌నెస్ మోడ్, పంచీ కలర్స్
తక్కువ బ్లూ లైట్‌తో కళ్లకు రక్షణ లాంటివి ఉండనున్నాయి.
ఇది మీడియా వినోదం, గేమింగ్, రోజువారీ ఉపయోగాల్లో మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.
ప్రాసెసర్..
Snapdragon 6 Gen 3
నోట్ 15కు శక్తినిచ్చేది Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్.
గేమింగ్‌లో ల్యాగ్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్
AI పనితీరులో అప్‌గ్రేడ్
5G నెట్‌వర్క్ సపోర్ట్
తక్కువ వేడి ఉత్పత్తి
కెమెరా..
చైనా వెర్షన్‌లో ఉన్న 50MP కెమెరా స్థానంలో, ఇండియన్ వేరియంట్‌లో 108MP ప్రైమరీ కెమెరా ఇవ్వడం కంపెనీ చేసిన అతిపెద్ద మార్పు.
మెరుగైన డీటైల్
మంచి నైట్ ఫోటోగ్రఫీ
స్టెబిలైజ్డ్ వీడియోలు అందించనున్నట్లు అంచనా.
సెల్ఫీ కెమెరా 16MP ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.
బ్యాటరీ & ఛార్జింగ్..
రెడ్‌మీ నోట్ 15లో భారీ 5520mAh బ్యాటరీని అందిస్తున్నారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్
ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఫోన్ వినియోగం
పవర్ ఆప్టిమైజేషన్‌తో మెరుగైన స్టాండ్‌బై
కొత్త HyperOS 2తో బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
సాఫ్ట్‌వేర్..
HyperOS 2 - స్మూత్ UI, తక్కువ బ్లోట్వేర్
షావోమీ కొత్తగా రూపొందించిన HyperOS 2 ఈ ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ అయి వస్తుంది.
క్లీనర్ UI
వేగవంతమైన యాప్ ఓపెనింగ్స్
మెరుగైన యానిమేషన్స్
తక్కువ బ్లోట్వేర్
ప్రైవసీ, సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు
డిజైన్..
టీజర్ల ప్రకారం నోట్ 15 యొక్క డిజైన్ చాలా స్లిమ్‌గా ఉండబోతోంది.
7mm చుట్టుపక్కల మందం
ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్
గ్లాస్ బ్యాక్ ఫినిష్
కలర్ ఆప్షన్స్..
ఈ ఫోన్‌ను ప్రీమియమ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలబెడతాయి.
ధర..
రూ.20,000 - రూ.25,000 మధ్య అంచనా
Redmi Note 15 ధర భారత మార్కెట్‌లో రూ.20,000 - రూ.25,000 మధ్య ఉండవచ్చని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications