కొత్త ఏడాది కానుకగా జనవరిలో రిలీజ్ కానున్న ఫోన్స్ ఇవే..!
2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. న్యూ ఇయర్.. మరి కొద్దిరోజుల్లోనే సంక్రాంతి.. ఆ తర్వాత రిపబ్లిక్ డే.. ఇలా వరుసగా పండుగలు, ముఖ్యమైన రోజులను పురస్కరించుకొని.. స్మార్ట్‌ఫోన్ సంస్థలు సైతం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. కొత్త ఏడాది మొదలవగానే అనేక ప్రముఖ బ్రాండ్లు తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లను జనవరి నెలలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి జనవరి 2026 మంచి ఛాయిస్ లను అందిస్తుంది.
కాగా ఈ నెలలో ఒప్పో, రియల్‌మీ, పోకో, రెడ్‌మీ వంటి బ్రాండ్లు ప్రధానంగా మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తూ కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాయి. డిజైన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ల ధరలు సుమారు ₹15,000 - ₹35,000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి కంపెనీల మధ్య పోటీతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు, మెరుగైన వాల్యూ ఫర్ మనీ దక్కుతుందని అంటున్నారు.

ఏ ఏ ఫోన్స్ లాంఛ్ కానున్నాయంటే..?
ఒప్పో రెనో 15 సిరీస్..
ఒప్పో రెనో 15 సిరీస్ జనవరి 2026లో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో
Reno 15
Reno 15 Pro
Reno 15 Pro Mini
మొత్తం మూడు మోడల్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్లన్నింటికీ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించడంతో బలమైన బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. ప్రీమియం లుక్ & ఫీల్‌తో ఈ సిరీస్ యూత్‌తో పాటు ప్రొఫెషనల్స్‌ను కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ఒప్పో రెనో 15 డిస్‌ప్లే వివరాలు
Reno 15: 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Gorilla Glass 7i
Reno 15 Pro: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Gorilla Glass Victus 2
Reno 15 Pro Mini: 6.32 అంగుళాల కాంపాక్ట్ AMOLED డిస్‌ప్లే, Gorilla Glass 7i
మూడు మోడల్స్‌కి IP66, IP68, IP69 రేటింగ్స్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
హై రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, కలర్ అక్యూరసీ విషయంలో కూడా ఈ డిస్‌ప్లేలు టాప్ లెవల్‌లో ఉండే ఛాన్స్ ఉంది.
పోకో M8 5G..
పోకో M8 5G జనవరి 8, 2026న అధికారికంగా లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
డిజైన్ & కెమెరా
కేవలం 7.35mm స్లిమ్ బాడీ
50MP AI రియర్ కెమెరా సిస్టమ్
ట్రిపుల్ కెమెరా సెటప్ + LED ఫ్లాష్
బ్యాక్ ప్యానల్‌పై రేసింగ్ ఇన్‌స్పైర్డ్ స్ట్రైప్స్
స్పోర్టీ & యూత్-ఫ్రెండ్లీ లుక్
లైట్‌వెయిట్ ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలవొచ్చు.
రియల్‌మీ 16 ప్రో సిరీస్..
రియల్‌మీ 16 ప్రో సిరీస్ జనవరి 6, 2026న ఇండియాలో లాంచ్ అవుతుంది.
MediaTek Dimensity 7300-Max చిప్‌సెట్
ఫుల్ 5G కనెక్టివిటీ
గేమింగ్ & మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా డిజైన్
AMOLED డిస్‌ప్లే
1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్: 6,500 నిట్స్
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Android 16 ఆధారిత Realme UI 7.0
AI పవర్డ్ ఫీచర్లు
కెమెరా : 200MP ప్రైమరీ రియర్ కెమెరా, Lumacolor Image Tuning టెక్నాలజీ, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్
( ఫోటోగ్రఫీ, వీడియో క్రియేటర్స్‌కు ఈ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది )
రియల్‌మీ 16 ప్రో+ 5G వేరియంట్‌లో Snapdragon ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 15 5G..
రెడ్‌మీ నోట్ 15 5G కూడా జనవరి 6, 2026న లాంచ్ అవుతుంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తోంది.
కెమెరా..
108MP రియర్ కెమెరా
4K వీడియో రికార్డింగ్ సపోర్ట్
డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరు..
కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
Snapdragon 6 Gen 3 చిప్‌సెట్
డైలీ యూజ్ & మల్టీటాస్కింగ్‌కు స్టేబుల్ పనితీరు
5,520mAh బ్యాటరీ
45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications