ఆకాశంలో మరో అద్బుతం.. సూపర్ మూన్ చూడ్డానికి రెండు కళ్లు సరిపోలే !!
వినీల ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా కానీ జాబిల్లి అందానికి మరేది సాటిరాదు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన చందమామ కథల దగ్గర నుంచి మనందరికీ ఆ జాబిలమ్మంటే ఎంతో ఇష్టం.. ప్రశాంతతకు ప్రకాశానికి నిదర్శనంగా నిలిచే ఆ మూన్.. మనకెంతో ప్రత్యేకం. అలాంటి చందమామ మన భూమికి దగ్గరగా వచ్చిందంటే నమ్ముతారా.. అది చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే విశ్వసించగలరా.. ఐతే నాసా విడుదల చేసిన కొన్ని పోటోలు చూస్తే అది నిజమేనని నమ్మకతప్పదు.
భూమికి అత్యంత దగ్గరగా ఉండే చందమామ.. మనకి అనూభూతులను పంచడమే కాదు.. అంతరిక్ష పరిశోధనల్లోనూ ఎంతో ఉపయోగపడుతంది. అలాంటి చందమామ ఇవాళ భూమికి మరింత దగ్గర వచ్చింది. తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ జాబిలమ్మను ప్రజలు సైతం ఎంతో ఆశక్తిగా తిలకించారు. తమ ఫోన్ కెమెరాల్లో సైతం బంధించి వాట్సప్ స్టేటస్ లు, ఇన్ స్టాగ్రామ్ స్టోరీలూ గాను పెడుతున్నారు.

ఐతే ఈ విధంగా చందమామ భూమికి దగ్గర రావడాన్ని సూపర్ మూన్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా శాస్త్రవేత్తలు సైతం సూపర్ మూన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ మూన్ లు రాగా.. ఇది మూడోదని చెప్పారు. ఆ సూపర్ మూన్ వచ్చే కాలాలు బట్టి.. వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయని పేర్కొన్నారు. అక్టోబర్ లో వచ్చే సూపర్ మూన్ ను హార్వెస్ట్ మూన్ అని నవంబర్ లో కనిపించేదాన్ని బీవర్ అని డిసెంబర్లో కనువిందు చేసి చందమామను కోల్డ్ మూన్ గా పిలుస్తారని చెప్పారు. సాధారణంగా చంద్రుడు భూమి నుంచి 3,84,000 కి.మీ దూరంలో ఉంటుంది. కానీ, సూపర్ మూన్ సమయంలో 3,57,000 కి.మీ.వరకు సమీపంగా వస్తుందని పేర్కొన్నారు.
ఇవాళ కనిపించిన సూపర్ మూన్ ఈ దశాబ్దంలోనే భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన జాబిలమ్మగా నిపుణులు చెబుతున్నారు. తన కాంతితో భూమిని మరింత అందంగా చూపించిందంటున్నారు. ఈ సూపర్ మూన్ ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో అత్యంత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపించింది. సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్, చెన్నైలో అత్యంత అద్భుతంగా కనువిందు చేసింది. ఇది సాధారణ పౌర్ణమి కంటే 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా ఉంది. ఈ కోల్డ్ సూపర్ మూన్ ను చూడాలంటే మళ్లీ 2042 వరకు ఆగాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు.
ఈ సూపర్ మూన్ ను ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ అని నిపుణులు తెలిపారు. భూమికి దగ్గరగా, మరింత పెద్దగా, కాంతివంతంగా చందమామ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా తన సైట్ లో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్ ను తమ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మీరు కూడా సూపర్ మూన్ ను చూసుంటే.. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.












Click it and Unblock the Notifications