నేడే 2025 చివరి సూపర్‌మూన్: ఈ 5 నిమిషాల పని చేస్తే మీ జీవితం మారిపోతుంది!
మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈ రోజు(డిసెంబర్ 4) రాత్రి ఆకాశంలో ఈ ఏడాది చివరి 'సూపర్‌మూన్' కనువిందు చేయనుంది. 2025లో ఇదే చివరిది కాబట్టి ఈ అద్భుత దృశ్యం ఎంతో ప్రత్యేకమైనది. ఈ రాత్రి వేళ చంద్రుని కాంతిలో కేవలం 5 నిమిషాలు ఒక చిన్న పని చేస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి మంచి రోజులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
సూపర్‌మూన్ అంటే ఏమిటి?
చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దగ్గరగా చేరుకునే స్థానాన్ని పెరిజీ అంటారు. ఈ సమయంలో పౌర్ణమి (పున్నమి) వస్తే, ఆ చంద్రుడిని సూపర్‌మూన్ అంటారు. సాధారణ రోజుల్లో కనిపించే పౌర్ణమి చంద్రుడి కంటే సూపర్‌మూన్ సుమారు 14 శాతం పెద్దగా, 30శాతం అధిక కాంతితో ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

ఎప్పుడు కనిపిస్తుంది?: నేడు సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిశ నుంచి సూపర్‌మూన్ ఉదయించడం ప్రారంభిస్తాడు. రాత్రి 8 గంటల తర్వాత నుంచి ఈ అద్భుత దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజామున 5 డిసెంబర్ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య చంద్రుడు అస్తమిస్తాడు.
ఈ రాత్రి ఆకాశంలో అద్భుతాలు
ఈ సూపర్‌మూన్ దృశ్యాన్ని దేశవ్యాప్తంగా చూడవచ్చు. ఈ రోజు రాత్రి ఆకాశంలో సూపర్‌మూన్‌తో పాటు మరో రెండు ఖగోళ అద్భుతాలను కూడా చూడవచ్చు. ఏడాది పొడవునా ఎదురుచూసే శీతాకాలపు నక్షత్ర మండలం కూడా ఈ రోజు కనిపిస్తుంది. బృహస్పతి గ్రహం కూడా చంద్రుడికి సమీపంలో మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.
భాగ్యోదయం కోసం చేయాల్సిన 5 నిమిషాల పని
జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయాల ప్రకారం, నేడు మార్గశిర పౌర్ణమి నాడు సూపర్‌మూన్ కాంతిలో ఈ పని చేయడం వలన అదృష్టం, సుఖ శాంతి, శ్రేయస్సు లభిస్తాయి:
*ఒక పాత్రలో నీరు, పాలు, కొంచెం బియ్యం కలపండి.
*ఈ మిశ్రమంతో ఇంటి డాబాపై లేదా ఇంటి బయట చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి.
*అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్రుడికి నమస్కరించి, ఆ పాత్రలోని కొన్ని బియ్యం గింజలను వెనక్కి తీసుకోండి.
*ఆ బియ్యాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి, మీ పర్సులో లేదా డబ్బు ఉంచే అల్మారాలో (ధన స్థానం) భద్రంగా ఉంచండి.
*ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధనం క్రమంగా పెరుగుతుందని నమ్మకం. ఈ అద్భుతమైన చంద్రుడిని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.












Click it and Unblock the Notifications