Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.20 వేల లోపు టాప్ 5 క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్స్ ఇవే..!

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రొఫెషనల్స్‌ వంటి వర్గాలకు ల్యాప్‌టాప్‌ల అవసరం గట్టిగా ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్ద బడ్జెట్‌ పెట్టకుండా స్మార్ట్‌ వర్కింగ్‌ సొల్యూషన్‌ కావాలనుకునే వారు తక్కువ బడ్జెట్‌ లో క్రోమ్‌బుక్‌లను ఎంపిక చేస్తున్నారు. సాధారణ విండోస్‌ ల్యాప్‌టాప్‌లకు క్రోమ్‌బుక్‌లు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ తేలికగా ఉండటం, ఫాస్ట్‌ బూట్‌ టైమ్‌, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ వంటి ఫీచర్లు వీటిపై మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ. 12,000 నుంచి రూ. 20,000 మధ్య అద్భుతమైన మోడల్స్‌ లభ్యమవుతున్నాయి. వీటిలో HP, లెనోవో, ఆసుస్‌, ఎసర్‌ వంటి బ్రాండ్లు విద్యార్థులు, టీచర్లు, లైట్‌ యూజర్ల కోసం ప్రత్యేక మోడల్స్‌ అందిస్తున్నాయి. వాటిలో టాప్ 5 ల్యాప్‌టాప్స్ గురించి మీకోసం ప్రత్యేకంగా..

top-5-chromebook-laptops-under-rs-20-000

HP Chromebook (2024)..

రూ. 12,499 ధరతో లభిస్తున్న HP Chromebook 11a (2024) బడ్జెట్‌ యూజర్లకు సరైన ఎంపిక.

ప్రాసెసర్‌: MediaTek MT8183

RAM / స్టోరేజ్‌: 4GB RAM, 32GB eMMC

డిస్‌ప్లే: 11.6-అంగుళాల HD స్క్రీన్‌

బ్యాటరీ లైఫ్‌: సుమారు 15 గంటల వరకు

ఆఫర్‌: ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులతో రూ. 1,249 వరకు తగ్గింపు

వారంటీ: 1 సంవత్సరం

కాంపాక్ట్‌ డిజైన్‌, లైట్‌వెయిట్‌ (కేవలం 1 కిలో చుట్టుపక్కల) ఫీచర్లతో ఇది విద్యార్థులకు బెస్ట్‌ చాయిస్‌.

Lenovo Chromebook..

లెనోవో నుండి వచ్చిన SmartChoice Chromebook ప్రస్తుతం రూ. 13,490 ధరకు లభిస్తోంది.

ప్రాసెసర్‌: Intel Celeron N4500

RAM / స్టోరేజ్‌: 4GB RAM, 64GB eMMC 5.1

డిస్‌ప్లే: 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ స్క్రీన్‌

వారంటీ: 1 సంవత్సరం

డిజైన్‌: 180° హింజ్‌, టచ్‌స్క్రీన్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో

Google Chrome OSలో గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ వంటి సేవలు ఇన్‌బిల్ట్‌గా ఉండడం వల్ల రోజువారీ పనులకు ఇది బాగుంటుంది.

Lenovo 100e Chromebook Gen 4..

ఈ మోడల్‌ ప్రస్తుతం రూ. 12,990కి అందుబాటులో ఉంది.

ప్రాసెసర్‌: MediaTek Kompanio 520

RAM / స్టోరేజ్‌: 4GB RAM, 32GB eMMC

ఆఫర్‌: SBI లేదా Flipkart Axis Bank కార్డులతో రూ. 4,000 వరకు తగ్గింపు

వారంటీ: 1 సంవత్సరం

ఫీచర్లు: spill-resistant కీబోర్డ్‌, రఫ్‌ యూజ్‌ కోసం మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌

ఇది విద్యార్థులకు లేదా స్కూల్‌ యూజ్‌ కోసం రూపొందించబడింది. బలమైన బాడీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ దీని ప్లస్‌ పాయింట్లు.

ASUS Chromebook C523..

రూ. 16,327 ధరతో లభించే ASUS Chromebook C523 పెద్ద స్క్రీన్‌ ప్రేమికుల కోసం.

డిస్‌ప్లే: 15.6-అంగుళాల HD NanoEdge డిస్‌ప్లే

హింజ్‌: 180 డిగ్రీల ఫుల్‌ ఫ్లాట్‌ ఓపెనింగ్‌

RAM / స్టోరేజ్‌: 4GB RAM, 64GB స్టోరేజ్‌

బ్యాటరీ: 10 గంటల వరకు

ఆఫర్‌: రూ. 1,500 వరకు తగ్గింపు

వారంటీ: 1 సంవత్సరం

వీడియో లెక్చర్స్‌, డాక్యుమెంట్‌ ఎడిటింగ్‌, స్ట్రీమింగ్‌ వంటివి చేయడానికి ఇది చక్కటి ఎంపిక.

Acer Chromebook..

రూ. 19,990 ధరలో లభిస్తున్న Acer Chromebook 315 సిరీస్‌ బడ్జెట్‌ ప్రీమియం ల్యాప్‌టాప్‌గా నిలుస్తుంది.

ప్రాసెసర్‌: Intel Celeron N4500

RAM / స్టోరేజ్‌: 8GB RAM, 128GB eMMC

డిస్‌ప్లే: 15.6-అంగుళాల Full HD LED బ్యాక్‌లిట్‌ స్క్రీన్‌

డిజైన్‌: స్లిమ్‌ మెటాలిక్‌ ఫినిష్‌, యాంటీ-గ్లేర్‌ ప్యానెల్‌

వారంటీ: 1 సంవత్సరం

వీడియో ఎడిటింగ్‌, మల్టీటాస్కింగ్‌ లాంటి కొంచెం హెవీ యూజ్‌లకూ ఇది సరిపోతుంది.

క్రోమ్‌బుక్‌ కొనడానికి కారణాలు..?

10-15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌

ఆటోమేటిక్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌

ఫాస్ట్‌ బూట్‌ టైమ్‌ (10 సెకన్లలో ఆన్‌ అవుతుంది)

గూగుల్‌ ప్లే యాప్‌ సపోర్ట్‌

క్లౌడ్‌ స్టోరేజ్‌ ఇంటిగ్రేషన్‌

కేవలం 1-1.5 కిలోల మధ్య తక్కువ బరువు ఉండడం.

మరి క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్స్ కొనాలి అనుకునే వారు మీ అవసరాలకు అనుగుణంగా నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+