10 వేలకే బెస్ట్ ఫీచర్లతో "వివో Y19s GT 5G"..!

భారత మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తమ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇండోనేషియాలో తమ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y19s GT 5G ను అధికారికంగా విడుదల చేసింది.

బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చినప్పటికీ, ఇందులో మిడ్రేంజ్ ఫీచర్లను అందించింది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 90Hz రిఫ్రెష్ రేట్, ఐపీ 64 రేటింగ్, అత్యధిక స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలు దీన్ని ప్రత్యేకంగా టెక్ ప్రియులను ఆకర్షించేలా చేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

vivo-y19s-gt-5g-with-best-features-for-just-10-thousand

Vivo Y19s GT 5G ఫీచర్లు..

డిస్‌ప్లే..

ఫోన్ 6.74-అంగుళాల LCD ప్యానెల్ తో వస్తుంది.

1600 × 720 పిక్సెల్స్ (HD+) రిజల్యూషన్ కలిగి ఉంది.

90Hz Refresh Rate సహాయంతో స్క్రోలింగ్ దృశ్యాలూ చాలా స్మూత్‌గా కనిపిస్తాయి.

570 nits Peak Brightness వల్ల వెలుతురులోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.

ముందు భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో సెల్ఫీ కెమెరా ఉంది.

ప్రాసెసర్..

Vivo Y19s GT 5G MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ద్వారా నడుస్తుంది.

ఇది 5G కనెక్టివిటీతో పాటు శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.

గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలకు సరిపోతుంది.

RAM &స్టోరేజ్..

ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది

6GB RAM + 128GB స్టోరేజ్

8GB RAM + 128GB స్టోరేజ్

8GB RAM + 256GB స్టోరేజ్

MicroSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్..

ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

కెమెరా సెటప్..

రియర్ కెమెరా:

50MP ప్రాథమిక కెమెరా

డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నప్పటికీ, రెండవ సెన్సార్ వివరాలు వెల్లడించలేదు.

ఫ్రంట్ కెమెరా:

5MP సెల్ఫీ కెమెరా

ఆపరేటింగ్ సిస్టమ్..

ఫోన్ Android 15 ఆధారంగా నడిచే Funtouch OS 15 పై పనిచేస్తుంది.

ఇది యూజర్ ఫ్రెండ్లీ మరియు మల్టీ టాస్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

డిజైన్ & డ్యూరబిలిటీ..

ఫోన్ కొలతలు: 167.30 x 76.95 x 8.19mm

బరువు: 199 గ్రాములు

Side-Mounted Fingerprint Sensor ద్వారా వేగంగా అన్‌లాక్ చేసుకోవచ్చు.

IP64 Certification - డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో కొంతవరకు ప్రొటెక్షన్.

MIL-STD-810H సర్టిఫికేషన్ - షాక్, వైబ్రేషన్, తేమ, ఉష్ణోగ్రతలపై మన్నిక చూపిస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్..

Dual SIM (5G Support)

Wi-Fi 5

Bluetooth 5.2

NFC (Selected Regions only)

USB Type-C పోర్ట్ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్.

ధరలు (Prices in Indonesia)..

6GB + 128GB వేరియంట్ - IDR 1,999,000 (దాదాపు రూ. 10,500)

8GB + 128GB - IDR 2,199,000

8GB + 256GB - IDR 2,399,000

రంగులు..

Jade Green

Crystal Purple

బడ్జెట్ ధరలో లాంచ్ అయినా ఈ ఫోన్ 5జీ కావాలి అనుకునే వారికి మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇండియన్ మార్కెట్‌లో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+