చనిపోయే ముందు అందరికీ ఒకేలాంటి కలలు వస్తాయా?

మరణానికి చేరువలో ఉన్నప్పడు మనుషులు ఎలాంటి కలలు కంటారు? వారి మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై జరిగిన సరికొత్త పరిశోధన ఇప్పుడు సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటలీలోని అజియెండా USL-IRCCS పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో, మరణానికి కొన్ని రోజుల ముందు బాధితులు కనే కలలలో ఒకే విధమైన పోలికలు ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ జర్నల్ 'డెత్ స్టడీస్'లో ప్రచురితమయ్యాయి.

మరణానికి ముందు వచ్చే కలలు
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 239 మంది పాలియేటివ్ కేర్ వర్కర్లు, నర్సులు, సైకాలజిస్టులను ప్రశ్నించారు. చనిపోయే ముందు రోగులు తమతో పంచుకున్న అనుభవాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. చాలామంది రోగులు తాము చనిపోయిన తమ ఆత్మీయులను, బంధువులను కలలో చూస్తున్నట్లు పేర్కొన్నారు. వారు తమ కోసం ఎదురుచూస్తున్నారని, తమను రమ్మని పిలుస్తున్నారని చాలామంది రోగులు వివరించినట్లు ఈ పరిశోధన వెల్లడించింది.

What Do We Dreams Before Death New Study Reveals Common Visions and End-of-Life Dreams

ప్రయాణం, ప్రకాశవంతమైన కాంతి
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. చాలామందికి మరో లోకానికి వెళ్తున్నట్లుగా కలలు వస్తున్నాయి. మెరిసిపోయే ప్రకాశవంతమైన కాంతి, ఆకాశానికి వెళ్లే మెట్లు, తెరిచి ఉన్న తలుపులు వంటివి వీరి కలలలో తరచుగా కనిపిస్తున్నాయి. ఓ రోగి తాను తెరిచి ఉన్న ఒక ప్రకాశవంతమైన తలుపు వైపు పాదరక్షలు లేకుండా నడుస్తున్నట్లు కలగన్నానని చెప్పగా.. మరొకరు తీరం వెంబడి గాల్లో పరిగెడుతున్న తెల్లటి గుర్రాన్ని చూశానని వివరించారు. ఈ కలలు రోగులకు మరణం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి, ఓ విధమైన ప్రశాంతతను ఇస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

భయంకరమైన కలలు కూడా..
అయితే అందరి కలలు ప్రశాంతంగా లేవు. కొందరు రోగులు తమకు భయంకరమైన కలలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒక రోగి తన తల్లి ముఖం కలిగిన ఓ భయంకరమైన రాక్షసి తనను కిందకు లాగుతున్నట్లు చూశానని చెప్పాడు. మరణం పట్ల ఉన్న విపరీతమైన భయం లేదా జీవితాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేని మానసిక స్థితి కారణంగా ఇలాంటి పీడకలలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వీటిని కేవలం కలలుగా కొట్టిపారేయకుండా.. వారి అంతిమ క్షణాల్లో మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఇవి కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.

వైద్యపరమైన గుర్తింపు అవసరం
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఎలిసా రాబిట్టి మాట్లాడుతూ.. చాలామంది రోగులు తమకు వచ్చే ఇటువంటి 'ఎండ్ ఆఫ్ లైఫ్ విజన్స్' గురించి బయటకు చెప్పడానికి సంకోచిస్తారని తెలిపారు. తాము గందరగోళంలో ఉన్నామని లేదా పిచ్చిగా మాట్లాడుతున్నామని ఇతరులు అనుకుంటారేమోనని వారు భయపడతారని ఆమె పేర్కొన్నారు. వైద్యులు, కుటుంబ సభ్యులు వీటిని సహజమైన ప్రక్రియగా గుర్తించి, వారిని అర్థం చేసుకుంటే ఆఖరి క్షణాల్లో వారికి ఎంతో ఊరట లభిస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. సాధారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు చెప్పే అనుభవాలకు, ఈ రోగుల కలలకు దగ్గరి పోలికలు ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+