నీరు, డిటర్జెంట్‌కి బై బై.. 'వర్ల్‌పూల్' కొత్త వాషింగ్ మెషీన్ నెక్స్ట్ లెవెల్ !!
గృహోపకరణాల రంగంలో అగ్రగామిగా నిలిచిన వర్ల్‌పూల్ (Whirlpool) సంస్థ భారత మార్కెట్లో మరో వినూత్న ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన Whirlpool Expert Care Front Load Automatic Washing Machine ను ఈరోజు (2026 జనవరి 21) అధికారికంగా ఆవిష్కరించింది. ప్రత్యేకంగా నీరు లేదా డిటర్జెంట్ వినియోగం లేకుండానే బట్టలను తాజాగా మార్చగల సామర్థ్యం ఈ వాషింగ్ మెషిన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఈ విషయం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓజోన్ ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ..
ఈ వాషింగ్ మెషిన్‌లో అత్యంత వినూత్నంగా రూపొందించిన 'ఓజోన్ ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ'ను వర్ల్‌పూల్ అందించింది. తక్కువసేపు ధరించిన దుస్తులు, మళ్లీ ఉతకాల్సిన అవసరం లేకుండా కేవలం కొద్ది నిమిషాల్లోనే తాజాగా మార్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో లేదా తరచూ వాష్ చేయాల్సిన అవసరం లేని దుస్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఓజోనైజర్ పనితీరు ఎలా ఉంటుందంటే..?
ఈ మెషిన్‌లో అమర్చిన ఓజోనైజర్, గాలిలోని ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చి డ్రమ్‌లోకి విడుదల చేస్తుంది. విడుదలైన ఓజోన్ బట్టలపై ఉన్న దుర్వాసనలను తొలగించడంతో పాటు హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. దీని వల్ల బట్టలు సహజంగా శుభ్రత, తాజాదనాన్ని పొందుతాయి. డ్రై-క్లీన్ ఫ్యాబ్రిక్స్‌పై నిర్వహించిన పరీక్షల్లో రంగు మారడం, కుంచించుకుపోవడం వంటి సమస్యలు కనిపించలేదని వర్ల్‌పూల్ స్పష్టం చేసింది. ఈ విధానం తర్వాత బట్టలను వెంటనే ధరించవచ్చని కూడా తెలిపింది.
ఈ సిరీస్‌లోని వాషింగ్ మెషిన్‌లో స్టీమ్ వాష్ టెక్నాలజీను కూడా అందించారు. ఇది బట్టలలోని సూక్ష్మ మలినాలు, మడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, 6th Sense టెక్నాలజీ ద్వారా లోడ్ పరిమాణం, ఫ్యాబ్రిక్ రకాన్ని గుర్తించి డ్రమ్ కదలికలు, వాషింగ్ సమయాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. దీని వల్ల బట్టలకు నష్టం కలగకుండా సమర్థవంతమైన శుభ్రత లభిస్తుంది.
ఈ మెషిన్‌లో జీరో ప్రెషర్ ఫిల్ టెక్నాలజీను అందించడం మరో ప్రత్యేకత. తక్కువ నీటి పీడనం ఉన్న ప్రాంతాల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది. అవసరమైతే సంప్రదాయ పద్ధతిలో నీరు, డిటర్జెంట్‌తో పూర్తి వాష్ చేయడానికి కూడా సౌకర్యం ఉంది.
డిజైన్, స్పెసిఫికేషన్లు..
ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ 1400 RPM స్పిన్ స్పీడ్‌తో వస్తోంది.
330 mm వెడల్పైన డ్రమ్ ఓపెనింగ్ వల్ల పెద్ద దుస్తులు, బెడ్‌షీట్లు సులభంగా లోడ్ చేయవచ్చు.
ఎనర్జీ సేవింగ్ డిజైన్, తక్కువ శబ్దంతో పనిచేసే మోటార్ దీనికి అదనపు బలంగా నిలుస్తాయి.
ధర, వారంటీ వివరాలు..
ఈ సిరీస్‌లోని 7 కిలోల వేరియంట్ ధర ₹24,500 నుంచి ప్రారంభమవుతుంది. ఉత్పత్తి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ, మోటార్‌పై 10 సంవత్సరాల వారంటీను అందిస్తోంది.
కాగా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, పర్యావరణానికి అనుకూలంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ కొత్త వాషింగ్ మెషిన్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని వర్ల్‌పూల్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications