సగం ధరకే Xiaomi 14 Civi 5g.. అదిరిపోయే ఫీచర్స్ !!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది ప్రముఖ సంస్థ Xiaomi. చైనాకు చెందిన ఈ సంస్థ ప్రతి ఏడాది వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వినియోగదారులకు ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందించే బ్రాండ్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా కెమెరా, పనితీరు, డిజైన్ పరంగా ఫ్లాగ్‌షిప్ అనుభూతిని అందించే మోడళ్లతో Xiaomi మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తీసుకొచ్చిన Xiaomi 14 Civi భారీ ఆఫర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkart లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.54,998 ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం రూ.29,999కే పొందే అవకాశం ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా ధర మరింత తగ్గే అవకాశముంది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్, లైకా కెమెరా, మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్ వంటి ఫీచర్లు దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Xiaomi 14 Civi 5g ఫీచర్స్..
డిస్‌ప్లే..
Xiaomi 14 Civiలో 6.55 అంగుళాల AMOLED డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, బ్రైట్ కలర్స్ వల్ల వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రాసెసర్ & పనితీరు..
ఈ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 8s Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులు ల్యాగ్ లేకుండా స్మూత్‌గా జరుగుతాయి.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (2x జూమ్), 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందుభాగంలో డ్యూయల్ 32MP సెల్ఫీ కెమెరాలు ఉండటం సెల్ఫీ ప్రియులకు పెద్ద ప్లస్ పాయింట్. Leica కలర్ ట్యూనింగ్ ఫోటోలను మరింత ప్రీమియంగా మార్చుతుంది.
బ్యాటరీ & ఛార్జింగ్..
Xiaomi 14 Civiలో 4,700mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
డిజైన్..
స్లిమ్ మరియు లైట్ వెయిట్ ప్రీమియం డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత. 5G కనెక్టివిటీ, Wi-Fi 6, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, HyperOS వంటి ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.
ఇతర ఫీచర్లు..
8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications