కావ్యా పాప ఫ్యాన్ బాయ్- ఎవరికీ సాధ్యం కాని నయా రికార్డ్
ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతోంది భారత్. బ్రిస్బేన్ దీనికి వేదిక. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. 4.5 ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ క్రీజ్ లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ ఒక బౌండరీ, ఒక సిక్స్ సహాయంతో 23, గిల్ 16 బంతుల్లో ఆరు ఫోర్లతో 29 పరుగులు చేశారు. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.
ఈ మ్యాచ్ లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర రచించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యంత వేగంగా 1,000 పరుగులను పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డు సాధించాడు. 569 బంతుల్లోనే 1,000 పరుగుల అసాధారణ మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాకే చెందిన టిమ్ డేవిడ్‌ను అధిగమించాడు.

అంతేకాకుండా, మ్యాచ్‌లపరంగా భారత్ తరఫున అత్యంత వేగంగా టీ20 ఇంటర్నేషనల్స్ లో 1,000 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ ఘనతను అతడు 28వ ఇన్నింగ్స్‌లో సాధించాడం విశేషం. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మ్యాచ్‌ల పరంగా విరాట్ కోహ్లీ మాత్రమే అభిషేక్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తన 27వ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగులు పూర్తి చేశాడు. టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (573 బంతులు), న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ (611 బంతులు) అభిషేక్ తర్వాత నిలిచారు.
అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించడంతో, డేవిడ్ మలన్, సబావూన్ దవిజి వంటి ప్రపంచ స్థాయి వేగవంతమైన బ్యాటర్ల సరసన చేరాడు. వీరిద్దరూ తమ 24వ మ్యాచ్‌లోనే 1,000 పరుగులు సాధించారు. భారత ఆటగాళ్లలో సంజు శాంసన్ (995 పరుగులు), తిలక్ వర్మ (991 పరుగులు) కూడా ఈ రికార్డుకు చేరువలో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్ ఆరంభంలోనే అతను ఇచ్చిన క్యాచ్ ను గ్లెన్ మ్యాక్స్ వెల్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత కూడా అతనికి లైఫ్ లభించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి అభిషేక్ 13 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.












Click it and Unblock the Notifications