IPL 2024 Opening Ceremony: ఎల్లుండి నుంచే ఐపీఎల్-చేపాక్ లో సీఎస్కే, ఆర్సీబీ తొలిపోరు..!

మండు వేసవిలో క్రికెట్ అభిమానుల్ని అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సిద్దమైంది. పొట్టి ఫార్మాట్ లో మ్యాచ్ లకు అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ను పలు మార్పులతో బీసీసీఐ సిద్దం చేసింది. ఎల్లుండి చెన్నైలోని చేపాక్ మైదానంలో జరిగే ఆరంభ వేడుకలతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అదే రోజు చెన్నె సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ తో క్రికెట్ మజా మొదలు కానుంది.

ఎప్పటిలాగే ఐపీఎల్ ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ చెన్నై చేపాక్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రంగు రంగుల లైటింగ్స్ ఏర్పాట్లతో కూడిన చేపాక్ గ్రౌండ్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో పాటు మ్యూజిక్ లెజెండ్స్ ఏఆర్ రహమాన్, సోనూ నిగమ్ తమ ఆటపాటలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

All set for IPL 2024 Opening Ceremony in Chapauk Ground on March 22 CSK to take RCB in first match

అనంతరం రాత్రి 8 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టూకు మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సారధి మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న అంచనాల నేపథ్యంలో సొంత గ్రౌండ్ లో తొలి మ్యాచ్ కు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివస్తారనే అంచనాలున్నాయి. అలాగే ఆర్సీబీ తో జరిగే చెన్నై పోరు ప్రేక్షకులకు ఐపీఎల్ అసలు మజాను పంచబోతోంది. ఈ టోర్నీని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే జియో సినిమా యాప్ లో డిజిటల్ గానూ వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+