కొంప ముంచావ్ కదా సూర్యకుమార్ యాదవ్..!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అనూహ్య పరిణామాలు క్రికెట్ ప్రపంచంలో పెను దుమారాన్ని సృష్టించాయి. ముఖ్యంగా, ట్రోఫీ ప్రజంటేషన్ వేడుకలో భారత జట్టు వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సంచలన ఆరోపణలు చేశారు.

ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత, ఆఘా మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టోర్నమెంట్ అంతటా భారత జట్టు తమతో కరచాలనం చేయడానికి నిరాకరించిందని తీవ్ర విమర్శలు చేశారు. టోర్నమెంట్ ప్రారంభంలో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో సూర్యకుమార్ యాదవ్ నాతో వ్యక్తిగతంగా కరచాలనం చేశారు. కానీ కెమెరాలు ఉన్నప్పుడు, వారు మాతో కరచాలనం చేయరని ఆఘా పేర్కొన్నారు.

Asia Cup 2025 Controversy Erupts as India Refuses Trophy from ACC Chairman Pakistan Captain Alleges Handshake Snub

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, తనకు ఇచ్చిన ఆదేశాలను అతను పాటిస్తున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ఆఘా అభిప్రాయపడ్డారు. భారత జట్టు కరచాలనం చేయకపోవడం తమను కాదు, క్రికెట్‌ను అగౌరవపరుస్తోందని పాక్ కెప్టెన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సూర్యకుమార్ పాక్ కెప్టెన్‌తో మాట్లాడుతున్న వీడియోతో పాటు, నఖ్వి‌తో కరచాలనం చేసిన వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీంతో టీమిండియా ఒకింత ఇరకాటంలో పడినట్టు అయింది.

ఇక ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ, ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ట్రోఫీ ప్రజంటేషన్ వేడుకలో భారత జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది.

ఈ విషయంపై స్పందించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి దేవ్జీత్ సైకియా, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నాయకుడి నుంచి ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, క్రీడా స్ఫూర్తిపై ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+