Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం..

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్- 24, శివం దూబే-33 తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించడంతో గెలుపు ఖాయమైంది. పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఈ టోర్నీలో ఇది మూడో ఓటమి.

ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ వైఫల్యాలను, తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శనను అతను విశ్లేషించాడు. ఆరంభంలో పట్టు సాధించినప్పటికీ పాకిస్తాన్ ఓడిపోవడం మహ్మద్ అమీర్ ను కలచివేసింది. మ్యాచ్ చాలా వరకు పాక్ నియంత్రణలో ఉన్నా, చేజారిపోవడం పట్ల అతను తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమి తర్వాత ఆమిర్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Asia Cup Final Mohammad Amir s Emotional Moment Captured After Loss

పాకిస్తాన్ ఓటమికి గల కారణాలను అతను వివరించాడు. ఇది నమ్మశక్యం కానిదని వ్యాఖ్యానించాడు. అసలు ఏమి జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని వాపోయాడు. చాలాసేపు మ్యాచ్‌ మొత్తం పాకిస్తాన్ చేతుల్లోనే ఉందని, తొలుత బ్యాటింగ్, అనంతరం బౌలింగ్ లో రాణించిందని పేర్కొన్నాడు. 2024 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఓడిపోయిన మ్యాచ్ లాగే, ఈ మ్యాచ్‌ను కూడా వారికి అప్పగించినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు.

ఆసియా కప్ ను గెలిచే ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయామని మహ్మద్ అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌ గెలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ పతనంపై ఆమీర్ తీవ్ర విమర్శలు చేశాడు. 13.3 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులతో మంచి స్థితిలో ఉన్న పాకిస్తాన్, ఆ తర్వాత వికెట్లు కోల్పోయి 147 పరుగులకు ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు.

జట్టు వ్యూహం స్పష్టంగా లేదని, కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చి కుదురుకోవడానికి బదులు వెంటనే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించారని వ్యాఖ్యానించాడు. ఫైనల్ లో ఆడాల్సిన బ్యాటింగ్ కానే కాదని చెప్పాడు. ప్రతి గేమ్‌లో కూడా మొదటి 10 ఓవర్లలో పరుగులు ఆటోమేటిక్ గా వస్తాయని, చివరి 10 ఓవర్లల్లో బ్యాటర్లు కష్టపడాల్సి వస్తుందని వివరించాడు. అప్పటికి బంతి మెత్తబడటం వల్ల బ్యాట్‌పై సరిగ్గా రాదని, చివరి ఓవర్లల్లో కొత్త బ్యాటర్ కు ఆడటం కష్టమవుతుందని విశ్లేషించాడు.

ఆ దశలో- క్రీజ్ లో నిలదొక్కుకున్న బ్యాటర్ మాత్రమే ప్రభావం చూపగలడని ఆమిర్ చెప్పాడు. భారత టాప్ ఆర్డర్ పతనం తర్వాత ఒత్తిడిలో తిలక్ వర్మ ప్రదర్శించిన సంయమనాన్ని ఆమిర్ ప్రశంసించాడు. భారత సాధించిన విజయంలో తిలక్ పాత్ర కీలకమని అతను పేర్కొన్నాడు. అతనికి గేమ్‌ పై ఉన్న అవగాహన అద్భుతమని ప్రశంసించాడు. ఏ షాట్ ఎప్పుడు ఆడాలో పాకిస్తాన్ ఆటగాళ్ళు అతని నుంచి చాలా నేర్చుకోవాలని సూచించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+