పాకిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామాలు..!!
పాకిస్తాన్ క్రికెట్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మాజీ టెస్ట్ కెప్టెన్ అజహర్ అలీ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జాతీయ సెలక్షన్ కమిటీ, యూత్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా ఆయన సేవలు అందించారు. సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ రాజీనామాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. దీన్ని ఆమోదించింది.
చీఫ్ సెలెక్టర్ గా ఉన్నప్పటికీ.. తనకు తెలియకుండా అండర్-19 జట్ల పూర్తి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించడం వల్ల అజహర్ అలీ అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. అండర్ 19 జట్లు సెలెక్షన్ వ్యవహారం మొత్తం కూడా సర్ఫరాజ్ అహ్మద్ కు అప్పగించడంతో అజర్ అలీ పరిధి, అధికారాలకు కత్తెర పడినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో అసంతృప్తి గురైన అజహర్ అలీ తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. ఈ వారంలోనే ఆయన రాజీనామా లేఖను పంపగా, బోర్డు దానిని ఆమోదించింది.

అజహర్ అలీ మొత్తం 97 టెస్ట్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యాన్ని వహించారు. గత ఏడాదే ఆయన సెలెక్టర్, యూత్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా నియమితులయ్యారు. పీసీబీలో రెడ్ టేపిజం ఉందని, చీఫ్ సెలెక్టర్ గా తన నిర్ణయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిర్ణయాలను తీసుకోవడంలో కూడా తీవ్రంగా జాప్యం జరుగుతోందని అలీ భావించినట్లు చెబుతున్నాయి.
యూత్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ గా యువ ఆటగాళ్ల అభివృద్ధికి సంబంధించి పలు ప్రణాళికలను రూపొందించుకున్నప్పటి వాటిని అమలు చేయడం, ముందుకు తీసుకెళ్లకపోవడంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇది కూడా అజహర్ అలీ రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. అండర్-19 జట్ల బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించడం తన పాత్రను తగ్గించిందని అజహర్ భావించారు. సర్ఫరాజ్ అహ్మద్ కొంతకాలంగా పీబీసీ మెంటర్, అడ్వైజర్ గా వ్యవహరిస్తోన్నారు.












Click it and Unblock the Notifications