Gutta Jwala: గుత్తా జ్వాల అరుదైన రికార్డు-30 లీటర్ల పాలు దానం..!

సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇప్పటివరకూ తన ఆటలో పలు రికార్డులు సాధించడం చూశాం. కానీ ఆమె ఇప్పుడు తల్లిగా ఓ అరుదైన రికార్డు సాధించింది. అనితర సాధ్యమైన రీతిలో తల్లి గర్బం నుంచి నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్ని ఆదుకునేందుకు భారీ ఫీట్ చేసింది. ఏకంగా 30 లీటర్ల తన రొమ్ముపాలను తీసి దానం చేసేసింది. తద్వారా ఆమె మంచి మనసు చాటుకుంది. ఈ ఘనత ఆలస్యంగా తెలియడంతో అభిమానులతో పాటు పలువురు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో కుమార్తె మీరాకు జన్మనిచ్చిన తరువాత గుత్తా జ్వాల.. 30 లీటర్ల తల్లిపాలను ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేసింది. తద్వారా నెలలు నిండకుండా జన్మించిన పిల్లలు, తల్లిపాలకు దూరమైన పిల్లల్ని ఆదుకునేందుకు తన వంతుగా పెద్ద సాయం చేసింది. దీనిపై ఎక్స్ లో ఆమె ఓ పోస్టు కూడా పెట్టింది. ఇందులో 'తల్లి పాలు ప్రాణాలను కాపాడుతుంది. అకాల మరియు అనారోగ్య శిశువులకు, దాత పాలు జీవితాన్ని మార్చేవిగా ఉంటాయి. మీరు దానం చేయగలిగితే, మీరు అవసరంలో ఉన్న కుటుంబానికి హీరో కావచ్చు.'అంటూ పేర్కొంది.

Badminton Star Jwala Gutta Donates 30 Litres of Breast Milk to Save Premature Babies

భారతదేశంలో పాల దానం ఇప్పటికీ అసాధారణమే. సియోన్ హాస్పిటల్ (ముంబై), సూర్య హాస్పిటల్స్ (ముంబై, పూణే, జైపూర్), రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ (హైదరాబాద్), డిపియు హాస్పిటల్ (పుణే), అమారా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (ఢిల్లీ) వంటి కొన్ని ఆసుపత్రులు మరియు పాల బ్యాంకులు మాత్రమే దాత పాలను అంగీకరిస్తున్న సమయంలో గుత్తా జ్వాల తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.

Badminton Star Jwala Gutta Donates 30 Litres of Breast Milk to Save Premature Babies

మంచి ఆరోగ్యంతో ఉన్న తల్లులు, ధూమపానం లేదా హానికరమైన పదార్థాల నుండి విముక్తి, ప్రాథమిక రక్త పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మరియు కొన్ని ఇన్ఫెక్షన్లు లేదా వైద్య పరిస్థితుల ద్వారా ప్రభావితం కానివారు ఇలా తల్లిపాలను దానం చేయవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. గత సంవత్సరంలో చిన్న అనారోగ్యాలు, శస్త్రచికిత్స, కొన్ని మందులు, మితమైన ఆల్కహాల్/కెఫిన్ వాడకం లేదా టీకాలు తీసుకున్నా ఇప్పటికీ పాలు దానం చేయవచ్చని చెప్తున్నారు. HPV, HIV, కొన్ని క్యాన్సర్లు, ఇన్సులిన్-ఆధారిత మధుమేహం, ఇంట్రావీనస్ డ్రగ్ వాడకం లేదా ధూమపానం చేసేవారితో జీవిస్తే మాత్రం దానం చేయకూడదు. ఆమోదించబడిన పాల బ్యాంకులకు దానం చేయడం ద్వారా, భారతీయ తల్లులు అకాల మరియు అనారోగ్య శిశువులకు పోరాట అవకాశాన్ని ఇవ్వవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+