బీసీసీఐ బోల్డ్ డెసిషన్..: 16 వరకు డెడ్ లైన్ !!
ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధించిన ప్రభావం బీసీసీఐపై తీవ్రంగా పడింది. డ్రీమ్ 11 వంటి సంస్థలు స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకొన్నాయి. ఫలితంగా కొత్త స్పాన్సరర్లను వెదుక్కోవాల్సిన అవసరం వచ్చింది బీసీసీఐకి. ఈ దిశగా చర్యలు చేపట్టింది. టీమిండియా స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది. కఠిన నిబంధనలను రూపొందించింది. బిడ్స్ దాఖలు చేసే కంపెనీల కోసం ప్రత్యేకంగా ఓ నియమావళిని జారీ చేసింది.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు నేపథ్యంలో- రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్, క్రిప్టో కంపెనీల దరఖాస్తులను బీసీసీఐ నిషేధించింది. ఆసక్తిగల సంస్థలకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాఖలు చేయాలని సూచించింది. నేటి నుండే ఇది అందుబాటులో ఉంటుంది. బిడ్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16. నిజానికి- డ్రీమ్11తో బీసీసీఐ భాగస్వామ్యం 2026 వరకు కొనసాగాల్సి ఉంది. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా 2023-2026 సైకిల్ కోసం దాదాపు 358 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రద్దయింది.

ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సరర్ అన్వేషణలో పడింది బీసీసీఐ. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఇకపై సంబంధాలు పెట్టుకోవట్లేదని
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉన్నందున డ్రీమ్11 లేదా వంటి ఇతర గేమింగ్ కంపెనీతో తన స్పాన్సర్‌షిప్ సంబంధాన్ని కొనసాగించదని తేల్చి చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం, దీనికి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఆర్థిక అర్హత..
- గత మూడు ఆడిట్ చేసిన సంవత్సరాలలో సగటు టర్నోవర్ లేదా సగటు నికర విలువ రూ. 300 కోట్లు ఉండాలి.
- మోసం, ఆర్థిక నేరాలు లేదా నైతిక దుర్నీతితో కూడిన నేరాలకు క్రిమినల్ నేర నిర్ధారణలు ఉండకూడదు.
- రెండేళ్లు లేదా అంతకుమించి జైలు శిక్షను ఎదుర్కొన్న వ్యక్తులు లేదా సంస్థలు.. ఈ బిడ్డింగ్ దాఖలు చేయడానికి అనర్హులు. ఎటువంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉండకూడదు.
- బ్యాక్ డిఫాల్టర్లు కూడా బిడ్స్ వేయడానికి అనర్హులు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగివుండాలి.
- భారత్ లేదా విదేశాల్లో ఆన్‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్ లేదా క్యాసినో వంటి కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండకూడదు.
- ట్రేడింగ్, ఎక్స్ఛేంజీలు, టోకెన్‌ల వంటి క్రిప్టోకరెన్సీ సంబంధిత వ్యాపారాలు ఉండకూడదు.
- ఆల్కహాల్ ఉత్పత్తులు, బెట్టింగ్/క్యాసినో, ఆన్‌లైన్ మనీ గేమింగ్, పొగాకు, అశ్లీలత లేదా ప్రజల నైతికతకు అభ్యంతరకరమైన కంటెంట్, సరోగెట్ బ్రాండింగ్ సంస్థలు వేసే బిడ్స్ ను బీసీసీఐ తోసిపుచ్చుతుంది.












Click it and Unblock the Notifications