IPL 2024: త్వరలో ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ - బీసీసీఐ సన్నాహాలు..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నిర్వహణ బీసీసీఐకి కత్తిమీద సాముగా మారబోతోంది. గతంలో అలవోకగా 16 ఐపీఎల్ టోర్నీలు నిర్వహించిన బీసీసీఐకి ఎన్నికల సమయంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు అంతర్జాతీయ క్రికెటర్ల షెడ్యూల్స్, మరోవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకటించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీసీసీఐ అప్పటి ఐపీఎల్ సీజన్ ను దశల వారీగా విడుదల చేసింది. ఎన్నికల సమయాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా చేసింది. ఈసారి కూడా ఆ ప్రయోగాన్ని రిపీట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. తాము ముందుగా ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల చేసినా ఆ తర్వాత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, అది కాస్తా క్లాష్ అయితే ఇబ్బందులు తప్పవు. దీంతో దశలవారీగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలే మంచిదని భావిస్తోంది.

అరుణ్ సింగ్ ధుమాల్ నేతృత్వంలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి విడత ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్స్ కాకుండా మిగిలిన లీగ్ మ్యాచ్ లు మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. అనంతరం జరిగే రెండో విడతలో క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్స్ ఉంటాయని సమాచారం. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాగానే ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక వారం రోజుల్లోనే ఐపీఎల్ సీజగన్ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే జాతీయ సెలక్టర్లందరూ వేర్వేరు వేదికల్లో జరిగే ఐపీఎల్ గేమ్‌లకు హాజరవుతారని, కొత్త సెలెక్టర్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications