విడాకులపై చాహల్ సంచలన పోస్ట్
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మలది ప్రేమ వివాహం. 2020లో వీరి వివాహం జరిగింది. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.
ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె తన ప్రత్యేకమైన డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు.ధనశ్రీ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నారు. ఆమె తన స్వంత డ్యాన్స్ కంపెనీని కూడా స్థాపించారు. ఇటీవలే ఆమె ఓ తెలుగు సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించడానికి రెడీ అయ్యారు.అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పుడే వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లి రోజున సైతం వీరిద్దరు విషెష్ చెప్పుకోలేదు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. ఇదే సమయంలో చాహల్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. "నిజమైన ప్రేమ చాలా అరుదు. నా పేరు కూడా అలాంటిదే" అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు చాహల్. దీంతో చాహల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మరోవైపు విడాకులు వార్తలు వస్తోన్న నేపథ్యంలోనే చాహల్ మరో అమ్మాయితో కనిపించి షాకిచ్చాడు. ముంబైలోని హోటల్‌లో ఓ అమ్మాయితో చాహల్ కనిపించాడు. ఆమెతో కలిసి హోటల్ బయటకు వచ్చే సమయంలో మీడియాను చూసి చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. వైట్ టీ-షర్ట్, బ్యాగీ జీన్స్‌తో ధరించిన చాహల్.. కెమెరాల కంటపడకుండా ఉండేందుకు ఆపసోపాలు పడ్డాలు. హోటల్ పిల్లర్స్ వెనుకాల దాక్కోవడం, చేతులను కవర్ చేసుకోవడం వంటి పనులు చేశాడు. ఈ చర్యలతో ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే సదరు యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications