టీమిండియా కేప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది సెంచరీ మ్యాచ్

లక్నో: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్.. ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. వరుసగా అయిదు విజయాలను సాధించిన టీమిండియా.. ఆరో గెలుపుపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన అయిదింట్లోనూ జయకేతనం ఎగురవేసింది.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫస్ట్ ఇన్నింగ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లన్నీ కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో బరిలోకి దిగినవే. దీనికి భిన్నంగా- ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ ఆడుతోంది.

CWC 2023, IND vs ENG: Rohit Sharma’s 100th match as Captain of India

తొలి మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ- 17, శుభ్‌మన్ గిల్- 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతోన్నారు వారిద్దరూ. డేవిడ్ విల్లీ వేసిన మూడో ఓవర్‌లో 18 పరుగులను పిండుకున్నారు. ఇందులో ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి.

రోహిత్ సేన దూకుడు చూస్తోంటే టీమిండియా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. ఇప్పటివరకు ఓటమి ఎరుగని తిరుగులేని జట్టు ఇదొక్కటే. ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయఢంకా మోగించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు టీమిండియా ముందు మోకరిల్లాయి.

ఇంగ్లాండ్‌ దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిలో ఉంది. ఆ జట్టుకు అగ్ని పరీక్షే ఇది. చివరికి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా పరాజయాన్ని చవి చూసిందంటే ఎంత దయనీయంగా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. భారత్ సహా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో తన తదుపరి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

ఆ జట్టు సెమీస్ చేరుకుంటుందనే ఆశలు ఎవరికీ పెద్దగా లేవు. సెమీ ఫైనల్స్ చేరాలంటే భారీ తేడాతో టీమిండియా ఓడించాల్సి ఉంటుంది. గెలిచినా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కూడా. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లు ఆడగా నాలుగింట్లో దారుణంగా ఓడింది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్యే సెమీ ఫైనల్స్‌ ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.

కాగా- ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఓ అరుదైన ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. కేప్టెన్‌గా వందో మ్యాచ్ ఆడుతున్నాడీ హిట్ మ్యాన్. అతని కేప్టెన్సీలో టీమిండియా చివరి 17 మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. 15 మ్యాచ్‌లల్లో విజయకేతనాన్ని ఎగురవేసింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. అది టైగా ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+