నో డౌట్..క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మూడు విజయాలు- ఆరు పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. నేడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ స్టేడియంలో జరగబోయే మొట్టమొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఇదే.

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగింది. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసింది. అదే సమయంలో- మెరుపు ఫీల్డింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది కివీస్.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్-71, కేప్టెన్ టామ్ లాథమ్- 68, విల్ యంగ్- 54 పరుగులతో కదం తొక్కారు. మిఛెల్ శాంట్నర్, లోకీ ఫెర్గూసన్ మూడు చొప్పున వికెట్లను నేల కూల్చారు.
బ్యాక్ క్యాప్స్ నిర్దేశించిన 288 పరుగులను అందుకోలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. 34.4 ఓవర్లల్లో 139 పరుగులకు కుప్పకూలింది. 149 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్‌పై సాధించిన స్ఫూర్తిదాయక విజయాన్ని ఇక్కడ కొనసాగించలేకపోయింది. అన్ని రంగాల్లోనూ విఫలమైందా జట్టు.
ఈ మ్యాచ్‌లో శాంట్నర్ దుమ్ము దులిపాడు. ఆల్‌రౌండర్ అనే అర్థానికి అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లను పడగొట్టిన శాంట్నర్.. ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచ్‌ను అందుకున్నాడు. కేప్టెన్ హష్మతుల్లా షహీదీని పెవిలియన్ దారి పట్టించడానికి అతను పట్టిన క్యాచ్.. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ మొత్తానికీ హైలైట్‌గా నిలిచింది.
జట్టు స్కోరు 43 పరుగుల వద్ద ఉన్నప్పుడు లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హష్మత్ అవుట్ అయ్యాడు. అతను సంధించిన షార్ట్ బంతిని పుల్ షాట్ ఆడాడు హష్మత్. గాల్లోకి లేచిన ఆ బంతిని శాంట్నర్ అందుకున్న తీరు అద్భుతం. గాల్లోకి లేచిన బంతినే చూస్తూ, ఎడమ వైపునకు డైవ్ చేస్తూ దాన్ని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications