తెలుగమ్మాయికి జాక్‌పాట్ !

భారత మహిళా క్రికెట్లో ఒక్క ఏడాదిలోని అద్భుతమైన వేగంతో ఎదిగిన యువ సంచలనం, తెలుగమ్మాయి, స్టార్ స్పిన్నర్ శ్రీచరణి మహిళా ప్రీమియర్ లీగ్(WPL) 2026 మెగా వేలంలో కోట్లు పలికింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన అసాధారణ విజయాలు శ్రీచరణిని అత్యంత విలువైన ప్లేయర్‌గా మార్చాయి. వేలంలో యూపీ వారియర్స్‌తో హోరాహోరీగా పోటీపడిన ఆమె పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చివరికి రూ. 1.3 కోట్ల భారీ మొత్తానికి ఆమెను తిరిగి సొంతం చేసుకుంది.

శ్రీ చరణి బేస్ ప్రైజ్ కేవలం రూ. 30 లక్షలు మాత్రమే. ఆమెను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. యూపీ వారియర్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించగా.. వెంటనే ఆమె తొలి ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దూకింది. ఈ రెండు జట్ల మధ్య పోరు మొదట రూ. 75 లక్షల వరకు సాగింది. యూపీ వారియర్స్ ఒక దశలో వెనక్కి తగ్గినా, అనూహ్యంగా రూ. 90 లక్షలతో మళ్లీ పోటీలోకి వచ్చింది. దీనికి వెంటనే స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచింది. ఈ బిడ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణిని తమ జట్టులో తిరిగి చేర్చుకుని, ఆమెపై తమ నమ్మకాన్ని రుజువు చేసుకుంది. గత సీజన్‌లో కేవలం రూ. 55 లక్షలకు అమ్ముడుపోయిన శ్రీచరణి.. ఏడాది తిరిగేసరికి ఆమె ధర రెండింతల కంటే ఎక్కువ పెరగడం ఆమె అసాధారణ వృద్ధికి నిదర్శనం.

Delhi Capitals Re-Sign Rising Star Shree Charani for Rs 1 3 Crore in WPL 2026 Mega Auction

శ్రీ చరణి విలువ అమాంతం పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ వేదికపై ఆమె నిరూపించుకున్న నైపుణ్యమే. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆమెకు ఇంటర్నేషనల్ క్యాప్ కూడా లేదు. డబ్ల్యూపీఎల్ 2025లో కేవలం రెండు మ్యాచ్‌లలోనే ఆడినప్పటికీ ఆమె ప్రదర్శన సెలెక్టర్లను ఆకట్టుకుంది. ఆశ్చర్యకరంగా 2025 జూన్ వరకు కూడా ఆమె ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా భావించినప్పటికీ.. ఆమె అసాధారణంగా ఎదిగి చివరకు భారత ప్రపంచకప్ జట్టులో కీలక స్థానం సంపాదించింది.

2025లో భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. శ్రీ చరణి టోర్నమెంట్‌లో ఏకంగా 14 వికెట్లు తీసి, భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండో స్థానంలో నిలిచింది. ఒత్తిడితో కూడిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఆమె ప్రదర్శించిన నిలకడ, కచ్చితత్వం ఆమెను అంతర్జాతీయ స్టార్‌గా నిలబెట్టాయి.

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్లు కోరుకునే ముఖ్య లక్షణాలు-నియంత్రణ , ప్రశాంతత, ఒత్తిడిలో రాణించే అరుదైన సామర్థ్యం.. ఇవన్నీ శ్రీ చరణిలో పుష్కలంగా ఉన్నాయి. దీనివల్లే ఆమె బౌలింగ్‌కు అన్ని దశలలో కెప్టెన్లు ప్రాధాన్యత ఇస్తారు.శ్రీ చరణి కేవలం ఒక ఏడాదిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో స్థిరపడటమే కాకుండా, ప్రపంచకప్ విజయంలోనూ తన ముద్ర వేయడం ద్వారా, ఈ మెగా-వేలంలో ఆమెకు లభించిన భారీ ధరను సమర్థించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ అద్భుతమైన స్పిన్నర్‌ను మళ్లీ దక్కించుకోవడం వ్యూహాత్మకంగా చాలా కీలకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+