IPL 2025: ధోనీ స్టంపింగ్ vs చిరుత రన్నింగ్.. తేల్చేసిన చాట్ జీపీటీ
రాముడి లాంటి గుణం, అర్జునుడి లాంటి తేజస్సు, భీముడి లాంటి బలం, చిరుత లాంటి వేగం, ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా, ప్రత్యర్థులు రెచ్చగొట్టినా మిస్టర్ కూల్ గా ఉండే తత్వం.. ఇవన్నీ కలిపితే మన మహేంద్రసింగ్ ధోనీ. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు. దేశం కోసం టన్నుల కొద్దీ పరుగులు సాధించారు. వందల కొద్దీ వికెట్లు పడగొట్టారు. అంతకు మించిన విజయాలు అందించారు. కానీ సగటు క్రికెట్ అభిమాని మదిలో మహేంద్ర సింగ్ ధోనీ స్థానం ప్రత్యేకం. మరే కెప్టెన్‌కీ సాధ్యం కానన్ని ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందించాడు.

క్రికెట్ చరిత్రలో ధోనీ ఉత్తమ కెప్టెన్‌గానే కాదు బెస్ట్ ఫినిషర్‌గా కూడా గుర్తింపు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా 5, 6, 7 స్థానాల్లోనే బ్యాటింగ్ చేసిన ధోనీ.. వన్డేల్లో 50కి పైగా యావరేజ్‌తో 10,000కు పైగా పరుగులు రాబట్టి ఔరా.. అనిపించాడు. ఇక 2011లో వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ ఆడిన ఇన్నింగ్స్ ఓ హిస్టరీ. ధోనీ సిక్సర్ కొట్టి భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించిన క్షణాలు ఎప్పటీకీ గుర్తుంటాయి. ఇలాంటి ఎన్నో విజయాలను ధోనీ తన కెప్టెన్సీలో అందించాడు.
#IPL2024 unbelievable catch MSD super man Vijay Shankar out#msd #dhoni#IPLUpdate #CSKvGT #SRHvsMi #ViratKohli𓃵 #RohitSharma𓃵 #Pathaan #Diddy #KanganaRanaut #SonamWangchuk #SupriyaShrinate pic.twitter.com/vTTssXiOjU
— kdnkundan (@kundanlai) March 26, 2024
43 ఏళ్ల వయసులోనూ..
ఇక అయిదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్ లో మాత్రం రికార్డుల వేట కొనసాగిస్తునే ఉన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ మెరుపు స్టంపింగ్స్ తో, భారీ సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ లో సీఎస్కే తరపున ధోని 204 ఇన్నింగ్స్ లో 4699 పరుగులు సాధించాడు. సురేశ్ రైనా (171 ఇన్నింగ్స్ లో 4687) రికార్డును చెరిపేశాడు.
Ladies & gentlemen, presenting the GEN GOLD who never gets OLD! ⚡🔥#MSDhoni pulls off yet another lightning-fast stumping and this time, it's #PhilSalt who’s left stunned! 😮💨💪🏻
— Star Sports (@StarSportsIndia) March 28, 2025
Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports… pic.twitter.com/kK3B5jxhXT
స్టంప్స్ వేగం vs చిరత రన్నింగ్
43 ఏళ్ల వయసులోనూ ధోని మెరుపు స్టంపింగ్స్ తో ఔరా అనిపిస్తున్నాడు. సెకనులో పదో వంతులోనే స్టంప్స్ ను లేపేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యను ఇలాగే మెరుపు స్టంపింగ్ చేసిన ధోని.. ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ నూ ఇదే విధంగా పెవిలియన్ చేర్చాడు. ఐపీఎల్ లో అత్యధిక స్టంపింగ్స్ రికార్డు (44) ప్రస్తుతం ధోనీ పేరుమీదనే ఉంది. అయితే తాజాగా చాట్ జీపీటీని ఓ ప్రశ్న అడిగారు నెటిజన్లు ధోనీ స్టంపింగ్స్ వేగం ఎక్కువ.. ? లేక చిరుత రన్నింగ్ స్పీడ్ ఎక్కువ..? అని..అప్పుడు చాట్ జీపీటీ ఈ విధంగా చెప్పేసింది.
ధోనీ ఫాస్టెస్ట్ స్టంపింగ్ స్పీడ్ 0.08గా నమోదైంది. 2018 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ ఈ రికార్డు నమోదు చేశాడు. ఇక చిరుత పులి పరిగెత్తేటప్పుడు ఒక్కో అడుగు వేయడానికి 0.03 నుంచి 0.05 సెకన్లు తీసుకుంటుందట. అంటే ధోనీ స్టంపింగ్ స్పీడ్.. చిరుత రన్నింగ్ స్పీడ్ కంటే కొంచమే తక్కువ అని అర్థం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ధోనీ వికెట్ కీపింగ్ ఎలా ఉంటుందో అర్థం అవుతోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications