Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ నా మాతృభూమి- తేల్చేసిన పాక్ మాజీ క్రికెటర్..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా స్వదేశంపై విమర్శలు చేస్తూ భారత్ పై పొగడ్తలు కురిపిస్తున్నాడు. దీంతో భారత్ కు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకునే అతను ఇదంతా చేస్తున్నాడని స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆలస్యంగా స్పందించిన కనేరియా ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు.

ఇటీవల తాను పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడను, భారత్ అంతర్గత విషయాలపై ఎందుకు మాట్లాడతాననే అంశంపై చాలా మంది ప్రశ్నించడం, కొందరు భారతీయ పౌరసత్వం కోసమే నేను ఇదంతా చేస్తున్నానని కూడా ఆరోపించడం చూశానని దానిషే కనేరియా తెలిపాడు. అందుకే స్పందించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. పాకిస్తాన్ , దాని ప్రజల నుండి తాను అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమను పొందానన్నాడు. కానీ ఆ ప్రేమతో పాటు, పాకిస్తాన్ అధికారులు, పీసీబీ నుండి తీవ్ర వివక్షను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు కూడా జరిగాయన్నాడు.

former Pakistan cricketer danish kaneria declare india is motherland clarified on citizenship

భారత్ , దాని పౌరసత్వం గురించి స్పందిస్తూ పాకిస్తాన్ తన జన్మభూమి కావచ్చని, కానీ తన పూర్వీకుల భూమి భారత్ అన్నాడు. తన మాతృభూమి అయిన భారత్ తనకు ఒక దేవాలయం లాంటిదన్నాడు. ప్రస్తుతం భారతీయ పౌరసత్వం కోరుకునే ప్రణాళికలు తనకు లేవని, భవిష్యత్తులో తనలాంటి ఎవరైనా అలా చేయాలని ఎంచుకుంటే, సీఏఏ ఇప్పటికే తమలాంటి వారికి అమలులో ఉందని కనేరియా గుర్తుచేశాడు.

former Pakistan cricketer danish kaneria declare india is motherland clarified on citizenship

కాబట్టి తన మాటలు లేదా చర్యలు పౌరసత్వం కోసం చేస్తున్నట్లు చెప్పుకునే వారు పూర్తిగా తప్పని తెలిపాడు. తాను ధర్మం కోసం నిలబడటం కొనసాగిస్తానన్నాడు. మన నైతికతను దెబ్బతీస్తున్న, మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న దేశ వ్యతిరేకులు , నకిలీ లౌకికవాదులను బయటపెడతానన్నాడు. తతన భద్రత కోసం ఆందోళన చెందుతున్న వారికి, ప్రభు శ్రీరాముని ఆశీస్సులతో తాను, తన కుటుంబంతో సురక్షితంగా, సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే తన విధి రాముని చేతుల్లోనే ఉందన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+