IPL Auction: బిగ్ సర్ ప్రైజ్..! 30 లక్షలకు వచ్చి 8.4 కోట్ల జాక్ పాట్..!
ఇవాళ అబుదాబిలో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఓ పెనుసంచలనం నమోదైంది. ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఏకంగా 8.4 కోట్ల ధర వెచ్చించి కొనుగోలు చేసింది. సదరు ప్లేయర్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ ఆడలేదు. కేవలం దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుకుంటున్న మీడియం పేసరే. అయినా ఇవాళ్టి వేలంలో మూడు జట్లు అతని కోసం పోటీ పడటం చర్చనీయాంశమైంది.
జమ్మూకశ్మీర్ ఆల్ రౌండర్ అకీబ్ నబీ దార్ ఇవాళ్టి ఐపీఎల్ వేలంలో తొలిసారి పోటీ పడ్డాడు. దీంతో అతనికి కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ మాత్రమే పెట్టారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 30 లక్షలు ఇచ్చి అతన్ని దక్కించుకునేందుకు తొలి బిడ్ వేసింది.
అక్కడి నుంచి అసలు ఆట మొదలైంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతని కోసం పోటీలోకి వచ్చింది. వీరిద్దరూ పోటీ పడుతూ అకీబ్ దార్ ధరను కోటి దాటించారు.

ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అకీబ్ దార్ ను దక్కించుకునేందుకు 2.2 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. కానీ రాజస్థాన్ పట్టు వదలలేదు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ధర పెంచుకుంటూ పోయింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టే అతన్ని 8.4 కోట్లు చెల్లించి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అన్ క్యాప్డ్ ప్లేయర్ అకీబ్ దార్ జాక్ పాట్ కొట్టేశాడు. 30 లక్షల బేస్ ప్రైస్ నుంచి ఏకంగా 8.4 కోట్ల ధర అందుకున్నాడు. 29 ఏళ్ల అకీబ్ నబీ కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు పాత బంతితోనూ మెరుగ్గా బౌలింగ్ చేయగలడు. 2025-26 రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో తన జట్టు కాశ్మీర్ ను నాకౌట్ బెర్త్ కు చేర్చాడు. దీంతో అతనిపై ఢిల్లీ నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications