T20 World Cup Squad: టీమ్ లో ఎక్స్ ఫ్యాక్టర్ అతనే..! తేల్చేసిన గవాస్కర్..!

వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 పురుషుల వరల్డ్ కప్ కోసం ఇవాళ భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు సెలెక్టర్లు హ్యాండ్ ఇచ్చారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. దీంతో పాటు పలువురు ఫామ్ లో ఉన్న ప్లేయర్లకు సైతం అవకాశాలు లభించాయి. అక్షర్ పటేల్ ను తొలిసారి వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టు కూర్పుపై క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. జట్టు కూర్పుపై సంతృప్తి వ్యక్తం చేసిన గవాస్కర్.. ఈసారి టోర్నీలో ఈ టీమ్ నుంచి ఎక్స్ ఫ్యాక్టర్ కాబోయే ఆటగాడెవరో తేల్చిచెప్పేశాడు. సెలెక్టర్లు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసిన అక్షర్ పటేల్ ఈసారి టీమ్ లో ఎక్స్ ఫ్యాక్టర్ అని గవాస్కర్ వెల్లడించాడు. ఇందుకు గల కారణాల్ని కూడా గవాస్కర్ బయటపెట్టాడు.

Gavaskar on India s T20 World Cup 2026 Squad This Player Is the X-Factor

అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అని, అలాగే బ్యాట్ తోనూ, బంతితోనూ అతను ఎక్స్-ఫాక్టర్ కాబోతున్నాడని గవాస్కర్ విశ్లేషించాడు. అతని బ్యాటింగ్ నిజంగా అద్బుతంగా ఉందని, అలాగే బంతిని ప్రతిచోటా క్రాష్ చేయగలడని వెల్లడించాడు. అక్షర్ బౌలింగ్ చేస్తాడు, తన వేగాన్ని మారుస్తాడు, క్రీజు అంతటా బౌలింగ్ చేస్తాడు. వేగ వైవిధ్యాన్ని తీసుకువస్తాడు, పట్టు మరియు మలుపు పొందుతాడని గవాస్కర్ విశ్లేషించాడు.

Gavaskar on India s T20 World Cup 2026 Squad This Player Is the X-Factor

అలాగే అక్షర్ అద్భుతమైన ఫీల్డర్ కూడా అని గవాస్కర్ తెలిపాు. కాబట్టి అతను ఎక్స్-ఫాక్టర్ అవుతాడని స్పష్టం చేశాడు. అతన్ని 5 లేదా 6వ స్ధానంలో బ్యాటింగ్ కు వాడుకోవచ్చని, అలాగే మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ చేయించగలమని తెలిపాడు. అక్షర్ తో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఆ పని చేయగలడని గవాస్కర్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+