ఫైనల్ లో ఆ ఇద్దరు భారత్ బెస్ట్ బౌలర్లకు రక్త కన్నీరే, కివీస్ స్టార్ బ్యాటర్ వార్నింగ్..!!
T20 World Cup Final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అహ్మదాబాద్ చేదు చేదు జ్జాపకాలు వెంటాడుతున్న వేళ.. టీమిండియా తుది కసరత్తు చేస్తోంది. బలమైన కివీస్ తో హోరా హోరీ పోరుకు సిద్దమైంది. తుది జట్టు కూర్పు పైన తర్జన భర్జన పడుతోంది. ఇదే సమయంలో కివీస్ ప్లేయర్లు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న కివీస్.. భారత్ టాప్ బౌలర్లకు హెచ్చరికలు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ నున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ టీమిండియా ను ఎదుర్కునే వ్యూహాలపైన కీలక వ్యాఖ్యలు చేసాడు. టీంఇండియా బౌలింగ్ సంచలనం బూమ్రా ను ఎదుర్కోవటం కోసం తాము సిద్దంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ తో డెత్ ఓవర్లలో బూమ్రా బౌలింగ్ అందరి ప్రశంసలు అందుకుంది. ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంతో, భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఫుల్ ఫాం లో ఉన్న కివీస్ బ్యాటర్ల విషయంలో బూమ్రా కొత్త అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాడు. దీంతో.. ఇప్పుడు బూమ్రా పైన కివీస్ బ్యాటర్లు గురి పెట్టారు. ముందుగానే మైండ్ గేమ్ తో పై చేయి సాధించే ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా గ్లెన్ ఫిలిప్స్ భారత్ బౌలర్లు బూమ్రా.. వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవటంలో తమ శక్తి చూపిస్తామని తేల్చి చెప్పారు.

ఫైనల్ లో రెండు జట్ల మధ్య బుమ్రా నే తేల్చేది
అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనటంతో సందేహం లేదని గ్లెన్ ఫిలిప్స్ వ్యాఖ్యానించాడు. బూమ్రా అమ్ములపొది లో ఉండే అస్త్రాలు విభిన్నంగా ఉంటాయని.. డెత్ ఓవర్లలో వేసే పర్ఫెక్ట్ యార్కర్లు ఏ బ్యాటరుకైనా సవాల్ గా నిలుస్తాయని అంగీకరించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ, అతనూ మనిషే అని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఫిలిప్స్ వ్యాఖ్యానించాడు. అందరిలాగే అతనికి కూడా ఓ కలిసి రాని రోజు ఉంటుందని.. అదే ఫైనల్ మ్యాచ్ రోజు కావాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు ఫిలిప్స్ తెలిపాడు.
ఇక.. భారత్ ను ఓడించేందుకు తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని.. బుమ్రాను టార్గెట్ చేయడమే తమ పని అని ఫిలిప్స్ ధీమా వ్యక్తం చేశాడు. అందుకు తాము సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. బుమ్రా ఎంత డేంజరస్ బౌలర్ అయినా, అతని బంతులను కచ్చితంగా బౌండరీలకు తరలిస్తామని, అందుకు తమ బ్యాటర్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారని తెలిపాడు. రెండు జట్ల మధ్య బుమ్రా ఒక్కడే తేడా అని గ్లెన్ ఫిలిప్స్ అభిప్రాయపడ్డాడు. దీంతో, ఇప్పుడు ఫైనల్ లో బూమ్రా ఎలాంటి అస్త్రాలతో బరిలోకి దిగుతాడు.. కివీస్ ను ఎలా కట్టడి చేస్తాడనేది ఉత్కంఠగా మారుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications