అత్తమ్మతో మహీకా ముచ్చట్లు!.. హార్దిక్ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మోడల్ మహీకా శర్మల మధ్య ప్రేమాయణం సాగుతోందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే 2026 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వీరిద్దరూ తమ బంధాన్ని దాదాపుగా ధ్రువీకరించారు. తాజాగా మహీకా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అత్తమ్మతో వీడియో కాల్
మహీకా శర్మ న్యూఇయర్ వేడుకల్లో భాగంగా హార్దిక్ పాండ్యా తల్లి నళిని పాండ్యాకు వీడియో కాల్ చేశారు. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. "నళిని పాండ్యాతో లాంగ్ డిస్టెన్స్ దర్శనం(Long distance darshan)" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో హార్దిక్ తల్లి నళిని ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించారు. దీనిని చూసిన నెటిజన్లు.. "హార్దిక్ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహికా శర్మ ఎవరు?
మహికా శర్మ ఓ ప్రముఖ మోడల్, యోగా ట్రైనర్. ఈమె ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహికా శర్మ పలు అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు.
2025లోనే అధికారిక ప్రకటన!
హార్దిక్ పాండ్యా తన 32వ పుట్టినరోజు (అక్టోబర్ 2025) సందర్భంగా మహికాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తన కొత్త రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. తన జీవితంలోని 'బిగ్ 3' (Big 3) అంటే.. తన కుమారుడు అగస్త్య, క్రికెట్, మహికా శర్మ అని పేర్కొంటూ ఆయన పెట్టిన పోస్ట్ అప్పట్లో వైరల్ అయింది.
నటాషాతో విడాకుల తర్వాత..
మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో 2024 జూలైలో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న హార్దిక్, ఇప్పుడు మహికా శర్మతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications